27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Pawan Praises : యువ హీరోలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ‘పెద్ద’ అంటూ ప్రశంసలు..

    Date:

    Pawan praises
    Pawan praises

    Pawan praises : జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున జనం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా పవన్ అధికార వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఆయన యువ హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తనకు హీరోలందరిపై అభిమానముందని పవన్ చెప్పుకొచ్చారు. కనిపిస్తే అందరితో మాట్లాడుతానని అన్నారు. అయితే సినిమాల పరంగా హీరోల మీద ఉన్న ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించవద్దని కోరారు.

    అయితే వారాహియాత్రలో భాగంగా ముమ్మడివరంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు తన కంటే పెద్ద హీరోలని ఎక్కువ పారితోషికం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. నా అభిమానులు.. ఎన్టీఆర్ అభిమానులు తరుచూ గొడవ పడుతుంటారని పలువురు అడిగారని, అయితే సినిమా కేవలం వినోదం మాత్రమేనని, ఇక్కడ ఘర్షణలకు తావు ఉండొద్దన్నారు. నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేకాభిమానం ఉంది. అదే విధంగా రాంచరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలయ్య, చిరంజీవి, ఇలా ప్రతి హీరోపై గౌరవం ఉందని పేర్కొన్నారు.

    ఇక చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లొచ్చారని, ఇప్పుడు వారు తెలిసినంతగా ప్రపంచస్థాయిలో తాను కూడా తెలియదని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఇగో లేదని, సగటు మనిషి బాగుంటే చాలనే తత్వం తనదని తెలిపారు. కులం, మతం అంటూ గొడవలు వద్దని చెప్పారు.
    సినిమాల అభిమానం అక్కడి వరకే అని, కానీ రాజకీయంగా ఆలోచన చేసి ఓటు వేద్దామని పిలుపునిచ్చారు. పోరాటం చేసే వాళ్లే ఈ సమాజానికి కావాలని పేర్కొన్నారు.

    అయితే ఈ పోరాటంలో తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాను క్రిమినల్ గ్యాంగులతో పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి జనం సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరు ఎంత దోచారో.. ఎంత దాచారో చూపిస్తానని.. ఇది జనసేనకు అధికారమిస్తేనే సాధ్యమవుతుందని కోరారు. ఇంకోసారి దెబ్బతిన్నా పారిపోనని, ఇక్కడే ఉంటానని చెప్పారు. కానీ తప్పు చేస్తే నష్టపోయేది మీరేనని వ్యాఖ్యానించారు.

    అయితే కొన్ని రోజులుగా పవన్ కాకినాడ ఎమ్మెల్యే ను టార్గెట్ చేశారు. జనసైనికులను కొట్టించడంతో పాటు వేధించడం, తనను బూతులు తిట్టడం కూడా పవన్ కోపానికి కారణంగా తెలుస్తున్నది. ఏదేమైనా పవన్ యాత్ర గోదావరి జిల్లాల్లో ఉత్సాహంగా నడుస్తు్న్నది. వారాహిపై వస్తున్న తమ అభిమాన హీరోకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గమంతా పవన్ ను ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...