Pawan sai dharam tej ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రో’ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ విన్న ఆ సినిమా పేరే వినిపిస్తుంది.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు.. జులై 28న రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.. పెద్దగా ప్రమోషన్స్ చేయక పోయిన పవర్ స్టార్ పేరునే పెద్ద ప్రమోషన్స్ గా ఫీల్ అవుతున్నారు.
ఈ వీకెండ్ లోనే థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటుంది.. పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించగా సాయి తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి..
కాగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక ఈ సినిమాకు సెన్సార్ వారు యు సర్టిఫికెట్ ను జరీ చేసారు.. ఆ సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా రన్ టైం 2 గంటల 14 నిముషాలు అని తెలుస్తుంది. ఈ సినిమాలో బోలెడంత స్టఫ్ ఉందని ట్రైలర్ తో తెలిసింది.
మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండడంతో ఈ సినిమాపై ముందు నుండి భారీ హైప్ ఉంది.. కాగా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇక కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ టచ్ కూడా ఉంది అనే చెప్పాలి..