
Bro : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది అనే విషయం విదితమే.. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు..
పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతుంది.. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ కూడా సముద్రఖని నటించి తెరకెక్కించారు. ఆయన చేసిన పాత్రనే తెలుగులో పవన్ చేస్తున్నాడు.. సాయి తేజ్ తంబీ రామయ్య అనే మరో కీలక రోల్ లో నటిస్తున్నాడు..
ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 14 నిముషాలకు రిలీజ్ చేసారు. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ రిలీజ్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అదిరిపోయింది అనే చెప్పాలి.. ”బ్రో” అనే పేరును ఈ సినిమాకు ఫైనల్ చేసారు..
ఈ సినిమాలో సాయి తేజ్ పవన్ ను బ్రో అని పిలుస్తారని అందుకే టైటిల్ కూడా బ్రో అనే పెట్టినట్టు తెలుస్తుంది.. ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది అనే చెప్పాలి.. ఇక ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ను ఇప్పటికే పవర్ స్టార్ పూర్తి చేసారు.. మిగిలిన భాగం శరవేగంగా ఫినిష్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. ఇక జులై 28న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.