29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Pawan Satire : పేర్నినానిపై పవన్ వ్యంగ్య కామెంట్స్.. అభిమానులకు పండుగే..

    Date:

    Pawan satire
    Pawan satire

    Pawan satire : ఏపీలో జనసేన అధినేతను తిట్టడం లో వైసీపీలో పేర్నినాని ముందుంటారు. ఆయన ప్రతి దానికి పవన్ పై విరుచుకుపడుతుంటారు. అయితే ఈసారి పవన్ రివర్స్ లో పేర్ని పై కామెంట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జోకులు పేలుతున్నాయి. ఇక పవన్ అభిమానులకు పండుగే. పేర్ని నానిని ఆడుకుంటున్నారు. ఏపీలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రస్తుతం కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో జనసందోహం ఈ సభలకు హాజరవుతున్నది. అయితే పవన్ వైసీపీ నాయకులపై చేస్తున్న విమర్శలు మాములుగా ఉండడం లేదు. ఈ వ్యాఖ్యలను జనసేన శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.

    పేర్ని నానికి తాజాగా పవన్ ఇచ్చిన కౌంటర్ను అభిమానులే కాదు.. రాజకీయ విశ్లేషకులు కూడా  నవ్వకుంటున్నారు. గోదావరి జిల్లాలో ‘వారాహి యాత్ర’ సందర్భంగా అధికార వైసీపీపై పవన్ విమర్శల తీవ్రత పెంచారు. తనదైన డైలాగులతో  విరుచచుకుపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలను చెప్పడంతో పాటు వారిపై మాటల తూటలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక పవన్ ఏది మాట్లాడినా, ఏదైనా పర్యటనకు వెళ్లినా మాజీ మంత్రి పేర్ని నాని విమర్శిస్తుంటారు. అయితే ఇటీవల తన రెండు చెప్పులను పవన్ కళ్యాణ్ కి మీడియా ముందు చూపిస్తూ అవమానించాడు. అయితే అప్పుడు నాని వ్యాఖ్యలను నిరసిస్తూ పవన్ అభిమానులు నిరసనకు దిగారు.

    అయితే తాజాగా పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందించారు. ‘ఈ మధ్య నేను ఇష్టం తో కొనుక్కున్న చెప్పులు అన్నవరంలో ఎవరో దొంగలించారు, అవి ఎక్కడున్నాయో వెతికిస్తారా, వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారి పోయిందంటే చివరికి గుడి బయట ఉన్న చెప్పులను కూడా దొంగలించేస్తున్నారు’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యంగ్యం గా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ మాటలను యూత్ తో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఏపీలో పరిస్థితి అలాగే ఉందని గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా పవన్ అప్పుడే తన డైలాగులు పెంచారు. అటు వైసీపీ శ్రేణుల నోటికి కూడా ఆయన పనిచెబుతున్నారు. ఎన్నికల వేళ ప్రజలకు మాత్రం మంచి పసందైన మాటల వంట పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన వారాహి యాత్ర ప్రారంభం..

    Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్...

    Pawan : పవన్ సీమ టూర్ ఫిక్స్.. ఇక వారాహి అక్కడికే..

    Pawan : వారాహి యాత్రతో పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయిన...

    Ustaad Bhagat Singh: ఇరకాటంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్.. ఏం జరిగిందంటే?

    Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైజాగ్ ప్రాంతంపై దృష్టి...