pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఈయన లైనప్ లో ఉన్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్” ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మన్హసి టాక్ తెచ్చుకుంది.
మొదటి షోతోనే సూపర్ రెస్పాన్స్ రావడంతో దూసుకు పోతుంది. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కింది. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ముందు నుండి ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది..
ఇక ఈ సినిమాలో ఏపీ ప్రభుత్వానికి పవన్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు.. ఇక తమిళ్ బ్లాక్ బస్టర్ వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఒరిజినల్ తెరకెక్కించిన సముద్రఖని డైరెక్ట్ చేసారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటించగా ఈ రోజు నుండి థియేటర్స్ లో సందడి మొదలయ్యింది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చిన ఇందులో పొలిటికల్ డైలాగ్స్ హీట్ పెంచుతున్నాయి.. గాజు గ్లాసు మీద రాసిన డైలాగ్ గురించి జనాలు ప్రత్యేకంగా మాట్లాడు కుంటున్నారు. మొత్తంగా పవన్ పొలిటికల్ ఎలివేషన్ కోసం త్రివిక్రమ్ బాగానే డైలాగ్స్ రాసారు.. చూడాలి మరి ఓపెనింగ్స్ ఎంత మేర తెచుకుంటుందో..