Pawan kalyan ఏపీలో అధికార వైసీపీ పై పోరు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ , టిడిపీ తో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు.. ఈ సమయంలో బీజేపీతో ఇప్పటికే జనసేన మిత్రబంధాన్ని ఖరారు చేసుకుంది. కానీ బీజేపీ అగ్ర నేతలు టీడీపీ నా కలుపుకొని పోయేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించకపోవడం కూడా ఇందులో భాగంగానే అని తెలుస్తున్నది. అయితే టీడీపీతో కలిసే పొత్తుకు వెళ్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్ర నేతలకు చెబుతున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ ముగిసినా ఆయన ఢిల్లీలో నే ఉండిపోయారు. బీజేపీ అగ్ర నేతలను కలిసి టీడీపీని కూడా భాగస్వామ్యం చేయాలని అడుగుతున్నట్లు తెలుస్తున్నది..
అయితే ఢిల్లీలో జరిగిన సమావేశానికి టీడీపీని ఆహ్వానించకపోవడానికి గతంలో జరిగిన పరిణామాలే కారణమని తెలుస్తున్నది. చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత తిరుగుబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ తో కలిసి 2019 ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇదంతా మనసులో పెట్టుకొనే బీజేపీ అగ్ర నేతలు ఆయనను దూరంగా పెడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతలు జేపీ నడ్డా అమిత్ షాలను కలిశారు. పొత్తులపై సంప్రదింపులు జరిపారు. కానీ వారి నుంచి ఎలాంటి హామీ దక్కలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్శబ్దంగా ఉంటున్నారు. పొత్తుల అంశంపై తానేమీ మాట్లాడడం లేదు.
జనసేన మాత్రం టిడిపీ తరఫున ఢిల్లీలో పొత్తుల అంశం గురించి బీజేపీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అయితే చంద్రబాబుని నమ్మని బీజేపీ నాయకులు కొంత సమయం కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.
బీజేపీ ఈసారి ఆయనను పొత్తుతో ఏపీలో కలిసి వెళ్లేందుకు నిముఖత చూపుతున్నట్లే అర్థమవుతున్నది మరి పవన్ ఎందుకు టీడీపీని కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నాడో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కోసమే ఆయన ఢిల్లీలో మకాం వేసినట్లు అంతా చర్చించుకుంటున్నారు. బీజేపీ అవసరం లేని చంద్రబాబు పవన్ కు ఎందుకు అవసరమయ్యాడని చర్చ సాగుతున్నది. అయితే ఏపీలో బలమైన పార్టీగా టిడిపీ ఉందని, ఆ పార్టీని కలుపుకొని వెళ్తేనే లాభం ఉంటుందని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసిపికి మేలు జరుగుతుందని ఆయన చెబుతున్నట్లుగా సమాచారం.