
ఇంస్టాగ్రామ్ వాడని వారంటూ లేరు.. అంతగా ఇంస్టాగ్రామ్ అందరిని అలరిస్తుంది.. యూత్ ను ఆకట్టుకుని టాప్ లో నిలిచింది.. ఇంతకు ముందు ఫేస్ బుక్ ఎక్కువుగా వాడే యువత ఇప్పుడు మాత్రం ఇంస్టాగ్రామ్ నే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఇంస్టాగ్రామ్ ఖాతాను కలిగి ఉన్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం ఇంస్టాగ్రామ్ లో అకౌంట్స్ ను కలిగి ఉండగా వారికీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు..
మన టాలీవుడ్ లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ లేనిది కొద్దిమందికి మాత్రమే.. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.. ఈయన ఇంత వరకు ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆ సమయం ఆసన్నం అయ్యింది అని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ రోజు కానీ రేపు కానీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయబోతున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు అఫిషియల్ గా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలపడంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ ఈ ఖాతాను రాజకీయాల కోసమే వాడబోతున్నారు అని తెలుస్తుంది. సౌత్ లో విజయ్ దళపతి అకౌంట్ ఓపెన్ చేసిన 99 నిముషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ReplyForward
|