
Hello-AP-Bye-Bye-YCP :
‘హలో ఏపీ…బై బై వైసీపీ’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇస్తున్న కొత్త స్లోగన్. ఈ ఒక్క స్లోగన్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. సోషల్ మీడియాలో మోత మోగిపోతున్నది. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడానికి పవన్..వారాహి యాత్రతో ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నాడు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ చేస్తున్న యాత్రకు ప్రజలు, అభిమానుల నుంచి అనూహన్య స్పందన వస్తున్నది. గతంలో ఉన్న రెస్పాన్స్ కు, ఇప్పుడొస్తున్న రెస్పాన్స్ కు చాలా తేడా ఉంది. పవన్ లో కొంత రాజకీయ పరిణితి కనిపిస్తున్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే తన పవన్ తన వారాహి యాత్రలో అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు. జగన్ ప్రభుత్వం అరాచకాలకు అడ్డాగా మారిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గంజాయి, కల్తీ మద్యం, అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక, ఇళ్ల స్థలాల్లో అవినీతి..అప్పులు చేసి అదే అభివృద్ధి అని జగన్ భ్రమ పడుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పవన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
అయితే పవన్ చేస్తున్న స్లోగన్ తో ఒకేసారి రెండు పార్టీలపై ప్రభావం పడుతున్నది. ఇటు అధికార పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ గుబులు రేపుతున్నది. ‘మీరనుకుంటే నేను ముఖ్యమంత్రి కాను.. ఓట్లేసి గెలిపిస్తే సీఎం అవుతానంటూ జగన్ చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆకట్టకుంటున్నాయి.
ఇటీవల అమలాపురంలో చేప్టిన ‘వారాహి విజయ యాత్ర’ బహిరంగ సభలో, ‘హలో ఏపీ.. బై బై వైసీపీ.. అంటూ పవన్ స్లోగన్ అందుకున్నారు. ఈ స్లోగన్ జనసేన కార్యకర్తలకు బాగా ఎక్కింది. ‘ఇక జగన్ ఖేల్ ఖతం..’ అంటూ జనసేన మద్దతుదారులు, జనసేనానితో గొంతు కలుపుతున్నారు.
‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ నినాదం సోషల్ మీడియాలోనూ హోరెత్తిపోతున్నది. లక్షల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు పవన్ అభిమానులు. కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ తో సాధ్యం కావడం లేదు. దీంతో ముద్రగడ రెండో లేఖనను ప్రచారం తెచ్చారు వైసీపీ నేతలు.
గతంలో వైసీపీ కూడా ..బై బై బాబు అంటూ నినదించింది. విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కు ఓటమికి ఈ నినాదం బాగా పనిచేసింది. ఇక టీడీపీ కూడా జగన్ ను టార్గెట్ చేస్తూ సైకో పోవాలి..సైకిల్ రావాలంటూ నినాదం మొదలెట్టింది.ఓ పాటను కూడా బయటకు తీసుకు వచ్చింది.
ఇప్పుడు పవన్ చేసిన హలో ఏపీ…బై బై వైసీపీ నినాదం కూడా మోగిపోతున్నది. పవన్ నినాదం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ReplyForward
|