Peak Bengaluru : బెంగళూరు అంటేనే ఐటీ సిటీ. అక్కడ ట్రాఫిక్ అంటే నిత్యనరకం. ఒక చోట నుంచి మరో చోటకు రోడ్డు మీద నుంచి పోవాలంటే చుక్కలు కనపడుతాయి. ఇక ఆదాయం కోసం ఆటో డ్రైవర్లు కూడా బెంగళూరు ట్రాఫిక్ లు ఎన్ని రైడ్ లు వస్తే అన్నీ పట్టుకుంటున్నారు.
“పీక్ బెంగళూరు” టైంలో ఆటోలకు గిరికీ బాగా ఉంటుంది. ఆ టైంలో ఆటో దొరకాలంటే కష్టం. ధర కూడా బాగా పలుకుతుంది. అందుకే ఆటో రిక్షా డ్రైవర్ లు అందని కాడికి రైడ్ లు పట్టుకొని సొమ్ము చేసుకుంటారు.
బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ అయితే రెండు వేర్వేరు యాప్‌లలో రెండు వేర్వేరు రైడ్‌లను ఒకే సారి అంగీకరించి వాహనదారుల ఆటోలో తీసుకెళ్లడానికి ప్లాన్ చేసిన చిత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోలో రెండు ఫోన్‌లు ఆ ఆటో డ్రైవర్ వద్ద ఉన్నాయి. వాటి ద్వారా రైడ్‌లు రెండు వేర్వేరు స్థానాలకు బుక్ చేయబడ్డాయి.
అయితే, రెండు రైడ్‌లను ఒకే ఆటో రిక్షా డ్రైవర్ అంగీకరించడంతో ఆటో కూర్చున్న ప్రయాణికుడు అయోమయంలో పడ్డాడు. రెండు రైడ్‌లకు డ్రైవర్ పేరు అలాగే ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకేలా ఉన్నాయని చిత్రంలో చూపించారు. ఒక రైడ్‌లో డ్రైవర్ దశరథ్ రెండు నిమిషాల దూరంలో ఉన్నాడని చూపించగా, మరొకటి అతను నాలుగు నిమిషాల దూరంలో ఉన్నాడని చూపిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని షేర్ చేసిన వినియోగదారుడు.. “పీక్ బెంగళూరు” ట్యాగ్‌ని ఉపయోగించాడు. ఇది బెంగుళూరు నగరంలో టెక్ , స్టార్ట్-అప్ సంస్కృతికి నిదర్శనం అని అందరూ కామెంట్ చేస్తున్నారు.
“2 వేర్వేరు స్థానాలు, 2 వేర్వేరు యాప్‌లు, 2 వేర్వేరు ఫోన్‌లు. అదే ఆటో, అదే డ్రైవర్.. బెంగళూరులో ప్రయాణకష్టాలు ఇవీ” అని ఒక వినియోగదారు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్‌కి నెటిజన్ల నుండి వెయ్యికి పైగా వీక్షణలు , అనేక చమత్కారమైన కామెంట్లు వచ్చాయి.
2 different locations
2 different apps
2 different phonesSame auto
Same driver @peakbengaluru much? pic.twitter.com/JhhoBg7c2J— harsh.fig 🐈 🍣 (@design_melon_) August 6, 2023