
Pellichoopulu Girl : తెలుగు అమ్మాయిలు గతంలో చాలా సంప్రదాయ బద్ధంగా ఉండేవారు. దీంతో వారికి అవకాశాలు కూడా వచ్చేది కాదు. ప్రస్తుతం జనరేషన్ అలా లేదు. గ్లామర్ చూపించే అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో వైజాగ్ బ్యూటీ ‘జ్ఞానేశ్వరి కాండ్రేగుల’ ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ మొదలెట్టిన ఈ భామ.. యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’తో పాపులర్ అయ్యింది. తాజాగా బికినీ ఫొటోలను షేర్ చేసింది. మీరు కూడా లుక్కేయండి!
షార్ట్ ఫిల్మ్స్ టు బిగ్ స్క్రీన్..
జ్ఞానేశ్వరి కాండ్రేగుల అచ్చ తెలుగు అమ్మాయి. మోడల్‌గా ప్రయాణం స్ట్రాట్ చేసిన ఈ అమ్మడు కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో చేసింది. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా బిగ్ స్ర్కీన్ కు వచ్చిన తర్వాత ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది.
పెళ్లి చూపులతో..
కొన్నేళ్ల క్రితం తెలుగులో ‘పెళ్లి చూపులు’ అనే షో ప్రసారమైంది. ఈ షో విపరీతంగా పాపులర్ అయ్యింది. 14 మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్ లీడ్ రోల్ పోషిస్తూ షోను చేశారు. షోలో గెలిచిన అమ్మాయితో ప్రదీప్‌కు పెళ్లి చూపులు జరుగుతాయని షోను డిజైన్ చేశారు. ఇందులో గెలిచింది జ్ఞానేశ్వరి. టైటిల్‌ను సొంతం చేసుకుంది.
గ్యాప్ ఇచ్చాం అంతే..
‘పెళ్లి చూపులు’ షో తర్వాత జ్ఞానేశ్వరి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ‘ప్రదీప్‌తో పెళ్లి చూపులు అయ్యాయి. పెళ్లి చూపులకు, పెళ్లికి మధ్య గ్యాప్ ఉంటుంది. ప్రస్తుతం మా మధ్య అదే నడుస్తోంది.’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ, వీరు ఎప్పుడూ ఎక్కడా జంటగా కనిపించలేదు. దీంతో టీఆర్పీ స్టంట్ మాత్రమే అని అందరికీ తెలిసిపోయింది.
సినిమాల్లో హీరోయిన్‌గానే
‘పెళ్లి చూపులు’ షోతో వచ్చిన ఫేమ్‌తో జ్ఞానేశ్వరి చాలా అవకాశాలను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే ఆమె హీరోయిన్‌గా ‘మిస్టర్ అండ్ మిస్’ మూవీలో కనిపించింది. ఆ తర్వాత ‘నీ జతగా’, ‘మాయలో’, ‘చక్రవ్యూహం’ వంటి చిత్రాలను చేసింది. ఇప్పుడు కూడా జ్ఞానేశ్వరి కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లల్లో కూడా నటిస్తోంది.
బిజీగానే
సినిమాల పరంగా బిజీగా ఉన్నా తన ఫాలోవర్స్ ను మత్రం మార్చిపోదు. వారి కోసం తన ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో జ్ఞానేశ్వరి డోస్ పెంచేసి అందాలను ఆరబోస్తుంది. ఇందులో భాగంగానే బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో టూ పీస్ బికినీ వేసుకొని గ్లామర్ షో చేసింది. జ్ఞానేశ్వరి ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్ అయిపోయాయి.