39.9 C
India
Tuesday, April 21, 2026
More

    దేశంలో పెండింగ్ కేసులే 5కోట్లు.. ఇవి పూర్తవ్వాలంటే 323 సంవత్సరాలు.. సుప్రీం మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వర్ రావు..

    Date:

    Breaking news: Supreme Court refuse Central petition
    Supreme Court

    ఏ దేశంలో అయితే సత్వర న్యాయం దొరుకుతుందో ఆ దేశ ప్రజలు భయం లేకుండా హాయిగా నిద్రిస్తారని పెద్దలు చెప్తుంటారు. ఏ దేశంలో అయితే నేరస్తులకు శిక్షలు వేగంగా పడతాయో వారు భయపడి నేరాలు చేసేందుకు జంకుతారు. ఫలితంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగదు. కానీ ఇది ఇండియాలో మాత్రం వీలుకావడం లేదనిపిస్తుంది. అవును మీరు చదివింది నిజమే. ఇక్కడ స్పీడ్ జస్టిస్ అనేది ఉండదు. అందుకు ఓ మాజీ న్యాయమూర్తి అన్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం మన దేశంలో కోర్టులోని ఇప్పటి వరకు ఉన్న కేసులు పూర్తయ్యే వరకే 323 సంవత్సరాలు పడుతుందట.

    స్పీడ్ జస్టిస్ కుదరదంటూ కొందరు న్యాయమూర్తులు ఇప్పటికే బాహాటంగానే చెప్తున్నా. అదే లేకుంటే నేరస్తుల సంఖ్య పెరిగి శాంతి భద్రతలు కనుమరుగవుతాయని కొందరు వాదిస్తున్నారు. ఇండియాలోని వివిధ సెక్షన్లు కూడా కేసుల జాప్యానికి కారణం అవుతున్నాయని మరికొందరు న్యాయ మూర్తులు అంటున్నారు. భార్యా భర్తల మధ్య వివాదం తలెత్తితే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కితే ఆ కేసును సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదా వేస్తారు న్యాయ మూర్తులు. కోర్టులకు తిరగలేక వారు కలిసిపోతారని న్యాయ మూర్తులు ఆలోచిస్తుంటారు. ఇందులో వారు చేసే మంచి కూడా ఉంది మరి. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, 20 సంవత్సరాల తర్వాత ఆ కేసు సుప్రీం కోర్టుకు వచ్చింది. అక్కడ అప్పుడు చీఫ్ జస్టిస్ గా రమణ ఉన్నారు. తెలుగులో వారిని సముదాయించి ఆ జంటను కలిపాడు. 20 సంవత్సరాల తర్వాత కలిసి ఏం చేస్తారని కొందరు వాదిస్తే.. అప్పటికైనా కలిసే ఉన్నారుగా అని మరికొందరు వాదించారు.

    ఇలా ప్రతీ కేసులో వాదనలు, ప్రతి వాదనలు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు న్యాయ మూర్తులు. చాలినన్ని బెంచ్ లు లేకపోవడం, అందులో ఉన్న వారికి సమయం కూడా తక్కువగా ఉండడం. ఇలా కారణం ఏదైనా కోర్టుల్లో పెండింగ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వర్ రావు ‘ఇంటర్‌నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మెడిటేషన్ సెంటర్’కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయనను ట్రస్టీగా ఎన్నుకున్నది మరో మాజీ న్యాయమూర్తి ఎన్‌వీ రమణ. జస్టిస్ లావు నాగేశ్వర్ రావు దీంతో పాటు మరికొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.

    దేశ వ్యాప్తంగా ఉన్న 5కోట్ల కేసులు కొలిక్కి రావాలంటేనే 323 సంవత్సరాలు పడుతుంది. అందులో సత్వరంగా వాదించే కేసులు కొన్ని ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టిన సుప్రీం ధర్మాసనం బెంచ్ లోని ఐదుగురు న్యాయమూర్తులు కేవలం ‘స్వలింగ సంపర్కుల’ కేసుపై పని చేయడం విషాదం అన్నారు. ప్రస్తుత తరుణంలో ఇది అంత అవసరం కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related