విశాఖపట్నం : బాధ్యత కలిగిన ఎమ్మెల్యే. కానీ అధికారం తలకెక్కడంతో రవాణా శాఖ నిబంధనలు తనకు వర్తించవన్నట్టు వ్యవహరిస్తున్నారు. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీ్‌పరాజ్ సోమవారం సాయంత్రం విశాఖ జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వచ్చారు. ఆయన కారుకు నంబరు ప్లేటు లేదు. ఆ స్థానంలో ‘పెందుర్తి ఎమ్మెల్యే’ అనే బోర్డు ఉంది. కారుకు ముందు, వెనుక కూడా అలాగే ఉంది. చట్టాలు చేసే వాటిని గౌరవించకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్టు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Breaking News