గత ఎన్నికల సమయంలో డేటా చోరీ అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వైసీపీ, ఇప్పుడు తాను కూడా అదే చేస్తున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఇప్పటికే చాలా మంది సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేసేలా వారిని ఆయా అంశాలతో వేధిస్తారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే అమ్మాయిలు, మహిళల మిస్సింగ్ వెనుక ఈ డేటా కలెక్ట్ అంశం తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ అధినేత ఈ అంశాన్ని వలంటీర్లకు చుట్టేశారు. మరి డేటా ఎక్కడికి వెళ్తున్నది.. దీంతో ఏం చేస్తున్నారు.. ఎవరిని మభ్య పెట్టబోతున్నారు.. అనే సందేహాలు నెలకొన్నాయి.
వ్యక్తుల అప్పులు, అలవాట్లు.. ఇతర విషయాలపై సమాచారాన్ని వీరు సేకరించి, ప్రైవేట్ వ్యక్తులకు అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చట్టబద్దత లేని వ్యక్తులకు ఇవి చేరితే మాత్రం ఇది వైసీపీ ప్రభుత్వ వైఫల్యంగా మారుతుంది. ఒక వేళ దీని వెనుక ఆ పార్టీ పెద్దల హస్తముంటే మాత్రం ఇది పెద్ద తప్పవుతుంది. మరి రానున్న రోజుల్లో కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే ఇలా డేటాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓటేసే సమయంలో సదరు వ్యక్తిని మభ్యపెట్టి, చివరకు బెదిరించైనా తమ దారికి తెచ్చుకునే వ్యూహంలో భాగంగా నే ఈ డేటాను కలెక్ట్ చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇక వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పవు. కేంద్రం తో పాటు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే, ఇక జగన్ సర్కారుకు తిప్పలు తప్పవు. ఏదేమైనా వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని సేకరించే బాధ్యతను వలంటీర్లకు అప్పగించిన జగన్ సర్కారు తీరను అందరూ తప్పుపడుతున్నారు. గతంలో టీడీపీ పై ఆరోపణలు చేసిన జగనే, ఈ రోజు అదే తప్పు చేస్తూ గెలవాలనే ప్రయత్నం చేయడంపై చాలా మంది మండిపడుతున్నారు.
ReplyForward
|