
Pernani Nani retire : ఏపీ వైసీపీలో కీలక నేత పేర్ని నాని.. మచిలీపట్నం ఎమ్మెల్యే.. మాజీ మంత్రిగా పని చేశారు కూడా. కొంత కాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇటీవల పలు సందర్భాల్లో అది స్పష్టమైంది. అయితే సోమవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు ప్రారంభంలో సోమవారం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం ముందే ఆయన సంచలన ప్రకటన చేశారు.
నన్ను స్టేజీ మీద నుంచి దిగిపోవాలని కొందరు అంటున్నారు..నాకు అర్థమైంది. కానీ తప్పదు. మరోసారి సీఎం జగన్ తో సమావేశమవుతానో లేదో తెలియదు. అయినా ఈ బాధను భరించక తప్పదు. సభకు వచ్చిన ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలే పేర్ని నానిని ఇబ్బందికి గురి చేశాయని తెలుస్తున్నది. తాను రిటైర్ అవుతున్నా అని ఆయన అన్నట్లు సమాచారం. ఇప్పుడివే మచిలీపట్నంలో సంచలనంగా మారాయి. అయితే బందర్కు మెడికల్ కాలేజీ వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని, సీఎం జగన్ తో అది సాధ్యమైందని పేర్కొన్నారు. 64 ఎకరాల్లో రూ. 500 కోట్లతో ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నది. మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి ఖాయమని చెప్పుకొచ్చారు.
అయితే మచిలీపట్నం పోర్టు పైలాన్ జగన్ ఆవిష్కరించారు.2.2 కిలో మీటర్ల పోర్టు బ్యాక్ వాటర్ పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు సముద్రుడికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, జోగు రమేశ్, విప్ ప్రసాదరాజు పాల్గొన్నారు.