
Perni Nani strategy : వైస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో పేర్ని ముందుంటారు. కానీ అతి స్పందనే కొంపముంచిందని మచిలీపట్నంలో, ఇటు వైసీపీలో చర్చ జరుగుతున్నది. పోర్టు శంకుస్థాపనలో ఆయన చేసిన ప్రసంగంపై చర్చ జోరుగా సాగుతున్నది. సీఎం జగన్ ను ఏక వచనంతో సంబోంధిచడంతో ముఖ్యమంత్రి ఆగ్రహానికి బలయ్యాడనని వెల్లడవుతున్నది. ఇష్టారీతిన మాట్లాడటంలో పేర్ని నాని స్టైలే వేరు. జగన్ ను ముందు మార్కులు కొట్టేసేందుకు ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడేవారు. ఈ విషయంలో సీఎంవో అధికారులు ఆయనను మందలించినట్లు తెలుస్తున్నది.
పేర్ని నాని తీరుతో ప్రభుత్వానికి అపవాదు వస్తున్నదని సీఎంవో అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తున్నది. ఇటీవల తరచూ ఆయన తాను ఉన్నా లేకపోయినా జగన్ వీడనని ఆయన వెంటే ఉంటానంటూ చెప్పుకొస్తున్నాడు. అయితే నాని భవిష్యత్ వ్యూహంలో భాగంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. తన కుమారుడిని రాజకీయంగా నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో అసహనానికి గురవుతున్నట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి ఎంత విధేయుడిగా ఉంటున్నా తన రాజకీయ భవిష్యత్ అటు ఇటు కావడంపై ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. ఒకే సామాజిక అయినా టార్గెట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కౌంటర్ చేయడంలో వైసీపీకి పేర్ని నాని దిట్ట. వైసీపీ కూడా ఆయనను చాలా ఉపయోగించుకుంది.
పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టినా లేదా మీటింగ్‌లో మాట్లాడినా నిమిషాల్లో పేర్ని నాని కౌంటర్ ఇచ్చేవాడు. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గమనార్హం. పవన్ కల్యాణ్ ను సెంటర్ చేయడంలో వైసీపీకి పేర్ని నాని ఉపయోగపడ్డాడు. పవన్‌పై విమర్శలు, సెటైర్లలో నాని తన మార్క్ క్రియేట్ చేశాడు. అదేసమయంలో జనసేన నుంచి అతని ధీటుగా సమాధానం ఇచ్చేవారు లేకుండా పోయారు. కానీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఒక్క సారిగా నాని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
పేర్ని నాని మాత్రం వచ్చే ఎన్నికల్లో తన కుమారుడని బరిలోకి దించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. అతని కుమారుడు పేర్ని కిట్టు గడప గడపకి మన ప్రభుత్వం అంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లకు దగ్గరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే, రానున్న ఎన్నికల్లో ప్రతీ సీటును సీఎం జగన్ కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి సానుకూల సంకేతాలతోనే పేర్ని నాని తన కుమారుడిని రంగంలోకి దించినట్లుగా తెలుస్తున్నది. ముఖ్యమంత్రి జగన్..తన సొంత నియోజకవర్గ ప్రజల సమక్షంలోనే పేర్ని నాని తన నిర్ణయం ప్రకటించారు. సీఎం జగన్ నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది. పార్టీకి బలమైన వాయిస్ గా ఉన్న పేర్ని నాని విషయంలో సీఎం జగన్ భవిష్యత్ లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.