Janasena ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. దీనిపై వైసీపీ శ్రేణులు, వలంటీర్లు మినహా ఏ ఒక్కరూ వ్యతిరేకంగా స్పందించలేదు. అయితే పవన్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మంత్రులతో ప్రెస్ మీట్ లు పెట్టించి మరి పవన్ ను తిట్టించిన జగన్, తాను కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. వలంటీర్లకు మద్దతుగా నిలిచారు. వలంటీర్లతో నిరసనలు చేయించారు. మరోవైపు పవన్ పై లీగల్ గా ముందుకెళ్తామని చెప్పారు. ఇక్కడితో ఆగకుండా వలంటీర్లతో కోర్టులో కేసు వేయించారు.
తమ పరువుకు నష్టం కలిగించారని, ఎంతో మనోవేదనకు గురిచేశారని పవన్ పై ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. న్యాయవాదితో కలిసి విజయవాడ మెట్రోపాలిటన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయని, తమను మనోవేదనకు గురి చేశాయని వివిధ సెక్షన్ల కింద ఆయనను శిక్షించాలని పిటిషనర్ తరఫున లాయర్ కోరారు. ఏపీ ప్రభుత్వం వెనుక నుంచి ఇదంతా నడిపిస్తు్న్నదని జనసేన శ్రేణులు మండిపడ్డాయి. అయితే ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ చెప్పారు.
అయితే పవన్ పై వేసిన ప్రైవేట్ కేసును కోర్టు విచారణకు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా జనసేన శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని పిటిషనర్ తరఫున లాయర్ ప్రకటించారు కూడా. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. అయితే ఈ పిటిషన్ పై సరైన దస్ర్తాలు లేవని, ఈ వ్యవహారం తమ కోర్టు పరిధిలోకి వస్తుందో కూడా చెప్పాలంటూ పిటిషన్ ను తిరస్కరించింది. సరైన దస్ర్తాలు సమర్పించాలని సూచించింది. దీంతో పవన్ పై ప్రభుత్వం వలంటీర్లతో వేయించిన పిటిషన్ ఆదిలోనే తిరస్కరణకు గురవడంతో, జనసేన శ్రేణులు సంబురపడుతున్నారు.