Viral Audio :
అగ్గిపుల్లా, సిగ్గుబిల్లా, కుక్కపిల్లా కాదేది కవితకు అనర్హం అన్నారు ఓ కవి. అవును ఇది ముమ్మాటికి నిజమే ఇక్కడ కవి కవితను ఉదహరిస్తూ అన్నాడు. కానీ దాని ప్లేస్ ను ఇప్పుడు సోషల్ మీడియా భర్తీ చేస్తుంది. కంటెంట్ ఏదైనా సరే దానికి స్పైసీ జోడిస్తున్నారు వైరల్ రాయుళ్లు. అది విశాదమా? వినోదమా? అనేది యూజర్లకు మాత్రం కన్ఫ్యూజన్ గా మారింది. కొన్ని కొన్ని ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ కూడా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
గతంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్ట్ లు చేసి ఫలితాలను జిల్లా అధికారి చెప్పేవారు. ఆ సమయంలో ఓలేటి లక్ష్మి అనే మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు సదరు అధికారి ఫోన్ చేశాడు. వారి మధ్య జరిగిన సంభాషణ విపరీతమైన వినోదాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దానిపై స్పూప్స్ మొదలయ్యాయి. ఇంకా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది ఆ సంభాషణ. దాన్ని కావాలని చేశారా? అని చాలా మంది అనుమాలను వ్యక్తం చేశారు. ఇలాంటిదే ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన ఇప్పడు వైరల్ అయ్యింది. ప్రస్తుతం టమోటా ధర నేపథ్యంలో దీన్ని చిత్రీకరించారు.
టమోటా ధర విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అందులో సారాంశం ఏంటంటే.. ‘ఒక యువతికి ఫేస్ బుక్ లో ఒక యువకుడు పరిచయం అవుతాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమ్మాయి సదరు యువకుడిని ఇంటికి పిలుస్తుంది. ఆ యువకుడు అమ్మాయి ఇంటికి వస్తాడు. మత్తు మందు కలిపిన చాక్లెట్ అమ్మాయికి ఇస్తాడు. యువతి మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని కొన్ని వస్తువులు తీసుకొని వెళ్లాడు. అవేంటంటే టమోటాలు.. టమోటాలు తీసుకెళ్లినా ఫర్వాలేదుకుందట యువతి కానీ టమోటా పచ్చడి జాడీని కూడాతీసుకెళ్లే వరకు తాను తీవ్రంగా మోసపోయానని ఏడుస్తుందట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.