Suhana Khan : సల్మాన్ ఖాన్-గౌరీ ఖాన్ కూతురే సుహానా ఖాన్. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న సుహానా.. ఈమె త్వరలో ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జోయా అక్తర్ డైరెక్షన్ లో ‘ది ఆర్చస్’ సినిమాతో వెండితెరపై కాలు మోపబోతోందట. ఖుషీ కపూర్, అమితాబ్ మనుమడు అగస్త్య నంద ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో పుట్టిన సుహానా.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుంది. బాల్యం నుంచి ఆమె క్రీడలంటే ఇష్టం. అండర్-14 స్కూల్ గేమ్స్ లో ఉమెన్ ఫుట్ బాల్ జట్టుకు కేప్టెన్ గా ఉంది.
ఈ మధ్య ఇన్ స్టాలో అమ్మడు తన అందాలను పంచుతుంది. ఇంకా తను చిన్న పిల్ల కాదని చెప్తున్నట్లు ఉన్నాయి ఫొటోలు. వీటిని చూసిన షారూఖ్ ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ది ఆర్చిస్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై షారూఖ్ కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.