Save men : ఒకప్పుడు సమాజంలో మహిళలు గృహిణులుగా మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ కాలక్రమేణా సమాజంలో మార్పులు వచ్చాయి. మహిళలకు చట్టపరంగా పలు హక్కులు, రక్షణా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం SHE టీమ్స్ లాంటి ప్రత్యేక విభాగాలు ఏర్పాటవడం మహిళలకు భద్రత కల్పించడంలో మైలురాయిగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఇదే తరహాలో మగవారికీ రక్షణ అవసరమైందంటూ ‘HE టీమ్స్’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా చౌక్ వద్ద ఒక అరుదైన ధర్నా జరిగింది.
ఈ నిరసనలో పలు పురుష హక్కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, మరియు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా పాల్గొన్నారు. వీరితో పాటు కొంతమంది అడ్వకేట్లు కూడా మగవారిపై అకారణంగా నమోదవుతున్న లఘు ఆరోపణల విషయంలో తమ ఆందోళన వ్యక్తం చేశారు.
మగవారిపై వేధింపులూ?
ఈ ధర్నాలో పాల్గొన్నవారు చెబుతున్న దాని ప్రకారం, కొందరు మహిళలు చట్టాల పరంగా లభించిన అధికారం, రక్షణలను తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. మగవారిపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ, శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. దీని వల్ల పలువురు పురుషులు ఆత్మహత్యలకే పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే మగవారిని కాపాడే ప్రత్యేక బృందాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
“HE టీమ్స్” డిమాండ్
ధర్నాలో పాల్గొన్నవారు, మహిళలకు SHE టీమ్స్ ద్వారా అందుతున్న రక్షణ తరహాలో మగవారికీ HE టీమ్స్ ఏర్పాటవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ టీమ్స్ ద్వారానే మగవారికి న్యాయం చేకూరుతుందని, బాధితులకు సహాయం అందుతుందని తెలిపారు.
HE టీమ్స్ ఏర్పాటు చేయాలని ఇందిరా చౌక్ వద్ద ధర్నా
మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా, అడ్వకేట్లు
SHE టీమ్స్ తరహాలో HE టీమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ pic.twitter.com/KbJhRZjjBP
— BIG TV Breaking News (@bigtvtelugu) April 5, 2025