24.1 C
India
Tuesday, October 3, 2023
More

    PM Modi Birthday Special : ప్రధాని మోదీ బర్త్ డే స్పెషల్.. విజయవాడలో ‘యూ బ్లడ్’ మెగా రక్తదాన శిబిరం

    Date:

     

    PM Modi Birthday Special
    PM Modi Birthday Special

    PM Modi Birthday Special : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని ఆయా చోట్ల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లోనూ మోదీ బర్త్ డేను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

    ఇక విజయవాడలోనూ మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.  యూ బ్లడ్. కామ్ ఫౌండర్ యలమంచిలి జగదీశ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. యూ బ్లడ్ యాప్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు. యూబ్లడ్ . కామ్, యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందుబాటులోకి తెస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. మాన్యప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా యూ బ్లడ్ తన సేవలను విస్తృతం చేస్తూ ముందుకెళ్తున్నదని చెప్పారు.  ఈ సందర్భంగా ఏ ఒక్కరూ రక్తకొరతతో చనిపోకుండా ఉండేందుకే ఈ యూ బ్లడ్ ను ఫౌండర్ జగదీశ్ బాబు యలమంచిలి కొనసాగిస్తున్నారని తెలిపారు.

    పెద్ద సంఖ్యలలో యువకులు ఈ మెగా రక్తదానశిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. మోదీ బర్త్ డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. రక్తదానం చేస్తున్నప్పుడు ఇది మరొకరికి సేవ మాత్రమే కాదని, స్వయాన భగవంతుడికి చేస్తున్న సేవలా భావించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయాలని, ఎలాంటి అపోహ అవసరం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు పలువురు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    Blue Whale : కోజికోడ్ తీరానికి కొట్టుకొచ్చిన చనిపోయిన తిమింగలం

    Blue Whale : చేపల్లో పెద్దది తిమింగలం. అది చిన్న చిన్న...

    Ramasethu PIL : ఆ విషయం మా పరిధి కాదు.. ‘రామసేతు’ పిల్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు..

    Ramasethu PIL : ‘రామసేతు’ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించి, ఆ...

    Minister Roja Emotional : బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా భావోద్వేగం

    Minister Roja Emotional : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Blood Donation Camp : మోడీ జన్మదిన వేడుకలు.. విజయవాడలో మెగా రక్తదాన శిబిరం.. భారీ స్పందన

    Mega Blood Donation Camp : ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా...

    PM Modi’s Birthday Celebrations : ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

    PM Modi's Birthday Celebrations : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా...

    Narendra Modi App : ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలంటే.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు..

    Narendra Modi App : భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటితో (సెప్టెంబర్...