
PM Modi Dandiya : దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. రావణ దహన కార్యక్రమాలు నిర్వహించారు. దసరా సంబరాల్లో ప్రముఖుల సందడి చేశారు. ఢిల్లీలోని మాధవ్ దాస్ పార్కులో నిర్వహించిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పీఎం నరేంద్రమోదీ తదితరులు హాజరయ్యారు.
దసరా వేడుకల సందర్భంగా మహిళలు దాండియా ఆడుతుండగా అక్కడికి వెళ్లి పీఎం మోదీ వారితో కలిసి కొంతసేపు దాండియా ఆడారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. పీఎం మోదీ లయబద్దంగా దాండియా ఆడుతున్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.