PM Modi Comments AP Bifurcation :
ఏపీ విభజనపై ప్రధాని మోదీ మరోసారి సంచలన కామెంట్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి కొత్త పార్లమెంట్ లో సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో పాత భవనంలో జరిగిన పలు అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగానే ఏపీ విభజన పై ఆయన స్పందించారు.
ఈక్రమంలో ఆయన పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఏపీ, తెలంగాణ విభజన గురించి మాట్లాడారు. ఈ భవనంలోనే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు జరిగింది. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీ విభజన సరిగా చేయలేదని, దీంతో ఇరు రాష్ర్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మాట్లాడారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ర్టాలను ఇదే భవనం నుంచి ఏర్పాటు చేసిందని, కానీ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు.
కానీ యూపీఏ హయాంలో చేసిన ఏపీ, తెలంగాణ రాష్ర్టాల విభజన సరిగా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కానీ విభజన సమయంలో సరైన పారదర్శకత పాటించలేదని చెప్పుకొచ్చారు. దీనివల్ల ఇరు రాష్ర్టాల వివాదాలు అలాగే ఉండిపోయాయని అభిప్రాయపడ్డారు.ఇటు తెలంగాణ.. అటు ఏపీ కూడా ప్రస్తుతం సంతృప్తిగా లేవని అభిప్రాయపడ్డారు. ఇరు వర్గాలను సంతృప్తి పరిచేలా విభజన జరగలేదని ప్రధాని మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గతంలో నూ ఒకటి రెండు సార్లు ప్రధాని ఈవిధంగానే మాట్లాడారు. తాజాగా మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ర్టాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.