28.6 C
India
Wednesday, September 16, 2026
More

    PM Modi : అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ

    Date:

    PM Modi
    PM Modi

    PM Modi :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా విమానంలో కొందరు భారతీయుల్ని స్వదేశానికి తిప్పి పంపారు. దాంతో అమెరికా మన పౌరుల్ని బలవంతంగా భారత్‌కు పంపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. కానీ అమెరికా పర్యటనలో మోదీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న దేశ పౌరులను భారత్‌కు తిరిగి తీసుకొస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు.

    ఓ దేశంలో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి, అక్కడ నివసించే హక్కు ఉండదన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అక్రమ వలసల్ని ఏ దేశం సహించదని, ప్రపంచమంతా ఇది వర్తిస్తుందన్నారు. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని భావించిన వారికి ప్రధాని మోదీ బిగ్ షాకిచ్చారు. మరోవైపు అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, చదువుపూర్తయిన వారు రెస్టారెంట్లలో, బార్లలో, పెట్రోల్ బంకుల్లో కనుక కనిపిస్తే వారి వివరాలు ఆరా తీస్తుండటంతో భయాందోళన నెలకొంది. ఇటీవల పంజాబ్ యువకుడు డంకీ మార్గంలో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో చనిపోవడం కలకలం రేపింది.

    మరో రెండు విమానాలలో భారత్‌కు..

    అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇదివరకే పలు దేశాలకు చెందిన వారిని విమానాలలో వారి స్వదేశాలకు పంపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా 104 మంది ఇండియన్స్‌ను సైతం తిప్పి పంపింది. ఫిబ్రవరి 5న విమానంలో వారు భారత్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగానూ మరో రెండు విమానాలలో కొందరు భారతీయులను స్వదేశానికి పంపిస్తున్నారు. ఇదివరకే ఓ విమానం బయలుదేరగా ఫిబ్రవరి 15న భారత్ చేరనున్న విమానంలో 170 నుంచి 180 మంది ఉంటారని సమాచారం. మరో విమానంలోనూ మరికొందర్ని భారత్‌కు తరలించేందుకు అమెరికా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trump : అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్.. వైదొలిగిన మస్క్

    Trump : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గట్టి షాకిచ్చారు....

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...