
PM NarenDra Modi : చిన్నతనంలో చాయ్ అమ్మిన వ్యక్తి భారత దేశానికి ప్రధాని కావడం అంటే మాములు మాటలు కాదు. దీని వెనుక ఎంతో అకుంఠిత దీక్ష ఉంది. నాటి బీజేపీ పెద్దలు ఎల్ కే అద్వానీ, వాజ్ పేయ్ ల ఆశీస్సులతో ఆర్ఎస్ఎస్ అండతో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక ఆయన ఛరిష్మా మొదలైంది. గోధ్రా అల్లర్ల సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా, కాల క్రమేణా అది శూన్యంలో కలిసిపోయింది. 2014 ఎన్నికలు మోదీని ప్రధాని పీఠం ఎక్కించాయి. అప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తుండడంతో, ఇక బీజేపీకి తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత మోదీని ఓ వర్గం ఓన్ చేసుకుంది. దేశం అంటే మోదీ.. విశ్వగురువు మోదీ అంటూ సోషల్ మీడియా వెర్రెక్కించింది. ఇంకే పదేళ్ల పాటు ఆయన ప్రధాని పీఠంపై సుస్థిరంగా ఉండిపోయారు. 2024 ఎన్నికలకు కూడా అదేస్థాయిలో బలంతో ఆయన సిద్ధమవుతున్నారు.
అయితే మోదీ పవర్ గురించి ఆయన సహచరుడు నితిన్ గడ్కరీ సంచలన విషయాలను ఇటీవల బయటపెట్టారు. ముఖ్యంగా మూడు ప్రధానంశాలను ఆయన వెల్లడించారు. మోదీ 18 గంటలు పని చేస్తారని, ప్రతి అంశాన్ని తీరికగా పరిశీలిస్తారు ఆయన చెప్పారు. రెండోది ఆయన కమిట్ మెంట్. అనుకున్నది చేయాలనుకున్నప్పుడు కమిట్ మెంట్ తో ఉంటారు. మూడోది ఏదైనా పని చేసినప్పుడు ఆయనలో కనిపించే పాజిటివ్ కోణం. ఈ మూడు మోదీకి ఉన్న బలం. దేశం వికాసం కోసం ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తారు. దేశమంటే ఉన్న ప్రేమ, చేయాల్సిన పనిపై నిబద్ధత, అనుక్షణం దేశం, ప్రజల మంచి కోసం ఆలోచనలు.. అది మరెవరికీ సాధ్యం కాదు. తాను కూడా మోదీని ఫాలో కావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకు సాధ్యం కాలేదు అంటూ నితీన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. మోదీలో ఎంతో అడ్మినిస్ర్టేషన్ లక్షణాలు ఉన్నాయని, అవన్నీ ఆయనకున్న బలాలని తెలిపారు.
అయితే మోదీ లాంటి లీడర్ ను ప్రపంచదేశాలు కూడా కీర్తించడానికి ఇదొక కారణం కూడా కావచ్చు. కుటుంబం కోసం కాకుండా అహర్నిశలు దేశం కోసం తపించే వ్యక్తిగా మోదీ పేరు వినిపిస్తుంటుంది. అయితే మోదీ కొంత మంది పెట్టబడి దారుల కోసం, తన వారి కోసం మాత్రమే పని చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. తనకు నచ్చని వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తారని చెబుతుంటాయి. మరోవైపు వివిధ దేశాల్లో మాత్రం మోదీ మానియా తగ్గడం లేదు. చాలా దేశాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏదేమైనా భారత ప్రధానిని విదేశాల్లో ఒక మహాశక్తిగా అభివర్ణించడం దేశవాసులందరికీ గర్వకారణమే.
ReplyForward
|