polavaram project ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ నత్తనడకన సాగుతున్నది, ఏపీని సస్యశ్యామలం చేసే ఈ కలల ప్రాజక్ట్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జాప్యమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు జరిగినా, ప్రస్తుతం జగన్ సర్కారు తీరుతో మరింత జాప్యమవుతున్నది. పోలవరాన్ని పక్కకు పెట్టడం ద్వారా కేంద్రం ఒత్తిడికి జగన్ తలొగ్గారని టీడీపీ నుంచి ఆరోపణలు ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ఇవేమి పట్టించుకోలేదు. డయాల్ ప్రం పనులు చేపట్టిన గుత్తేదారును కాదని, మరో కంపెనీకి పనులు అప్పగించారు. కానీ ఇటీవల ఆ పనులు చేయలేక కొత్తగా వచ్చిన కంపెనీ చేతులెత్తిసింది. దీంతో మరోసారి చంద్రబాబు హయాంలో ఆ పనులు చేసిన కంపెనీని ప్రస్తుతం ప్రభుత్వం సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
కేంద్రం కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు ఇవ్వకుండా తాత్సారం చేయడంతో ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయి. అయితే ఇంతకాలం సాగునీటికి అయిన ఖర్చులను మాత్రమే భరిస్తామని చెప్పిన కేంద్రం తాజాగా తాగునీటికి అయిన ఖర్చులను కూడా భరిస్తామని ముందుకు వచ్చింది. గతంలో ఈ ఖర్చులను ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తాగునీటి పైప్ లైన్ల తవ్వకాలకు సంబంధించిన నిధులు ఇస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
అయితే పునరావాస ఖర్చులు భరించమని కేంద్రం చెప్పింది. కానీ ఇటీవల ఇందుకు సంబంధించిన రూ, 10వేల కోట్లను ఇచ్చింది. దీంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు పెట్టిన ఖర్చును కూడా భరించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఎంత ఖర్చు చేశారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. అయితే ప్రాజెక్టు పునరావాస చర్యలకు పెట్టిన ఖర్చే ఎక్కువగా ఉంటుంది. వాటిని కూడా కేంద్రం నుంచి తెచ్చుకోగలిగితే ఏపీలో పోలవరం పనులు మరిం స్పీడప్ అవుతాయి.