TDP ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వెర్రితలలు వేస్తోంది. ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పని చేయకుండా వైసీపీకి కట్టుబడి పనిచేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలనే టార్గెట్ చేసుకుని వారి మీద కేసులు పెడుతున్నారు. దానికి కానిస్టేబుళ్లతోనే కేసులు పెట్టించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారే నిందితులుగా మారుతున్నారు. అసలు ఏపీలో చట్టం ఉందా? లేక ప్రభుత్వమే చట్టంగా చలామణి చేయిస్తోందా అనేది అనుమానంగానే ఉంటోంది.
పోలీసుల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. ప్రజా వ్యవస్థనే బలహీన పరుస్తున్న పోలీస్ కానిస్టేబుళ్ల తీరు విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. పుంగనూరులో ఎస్పీ రిషాంత్ రెడ్డి కుట్రతో టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. కిందిస్థాయి పోలీసుల్నే టీడీపీ నేతలపై ఉసిగొలుపుతున్నారు.
తాజాగా చంద్రబాబుపై ముదివీడు పోలీస్ స్టేషన్ లో ఓ కేసు పెట్టారు. ఏ1 చంద్రబాబు, ఏ2 దేవినేని ఉమ, ఏ3 అమర్ నాథ్ రెడ్డి, ఏ4 చల్ల బాబుపై కేసు నమోదు చేశారు. పోలీసులు పెడుతున్న కేసులతో భవిష్యత్ లో వైసీపీ నేతలకు ఇబ్బంది లేకుండా పోలీసులతోనే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు నల్లారి కిషోర కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, చల్ల బాబు, పులివర్తి నాని వంటి వారిని నిందితులుగా చేస్తున్నారు.
కానిస్టేబుళ్లతో కేసులు నమోదు చేయించడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందంటూ ఉచిత కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వీరి గొంతులు నొక్కేందుకు పక్కా ప్లాన్ లో భాగంగానే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం ఉందా? లేక వైసీపీ నేతల సైన్యం పనిచేస్తోందా అనే అనుమానలు అందరిలో వస్తున్నాయి.