సినిమా నిర్మించాలంటే మాటలు కాదు దానికి చాలా సహనం ఉండాలి. రసమయి బాలకిషన్ సోదర సమానుడు. మాకు రాజకీయాలు తెలియవు. సినిమా ఒక్కటే మాకు తెలుసు. జగపతి బాబు ఓ అద్భుతమైన నటుడు. తను లెజెండ్, రంగస్థలం, అఖండ వంటి చిత్రల్లో చూపిన నటన అద్వితీయం. ఏ భాషలో అయినా నటించే సత్తా ఉన్న నటుడు. రుద్రంగి మంచి హిట్ అయి అందరికి మంచి పేరు తీసుకురావలని కోరారు.
రుద్రంగి సినిమా మంచి హిట్ సాధించి ఆర్టిస్లులకు నిర్మాతకు లాభం చేకూర్చాలని కోరారు. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. సినిమా నిర్మాణం చాలెంజ్ తో కూడుకున్నది. హిట్టయితే ఫర్వాలేదు. కానీ ప్లాపయితేనే ఇబ్బందులు వస్తాయి. సినిమా వ్యయం బాగా పెరిగిపోయింది. అందుకే చాలా మంది సినిమాలు తీయడానికి ముందుకు రావడం లేదు.
హీరోయిన్ మమతా మోహన్ దాస్ క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ఆమె ఎంతో కష్టపడింది. క్యాన్సర్ బాధితులకు ఆమె ఆదర్శం అని బాలయ్య కొనియాడారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన బాలకృష్ణకు జగపతిబాబు కృతజ్ఝతలు తెలిపారు. అంత పెద్ద నటుడైనా ఇంత చిన్న సినిమాకు రావడం సంతోషంగా ఉందన్నారు. రుద్రంగి జులై 7న విడుదల కానుంది.
ReplyForward
|