
Ponguleti and Jupalli : ఖమ్మం రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగలనుంది. ఖమ్మంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వీరిని కేటీఆర్, కేసీఆర్ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆ పార్టీపై ఇద్దరు నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో ఖమ్మంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత ఎలాగైనా కేసీఆర్ అహాన్ని దెబ్బకొట్టాలని భావించారు. అయితే వీరి తర్వాతి పయనం ఎటువైపు ఉంటుందో? అని నేతలు చాలా రోజులుగా చర్చలు నిర్వహించారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తొలి రోజుల్లో ఏ పార్టీలో చేరుతారన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారు కూడా తొందరపడి అడుగులు వేయకుండా వేచి చూశారు. ఆ సమయంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఛరిష్మా ఉన్న నేతలు బీజేపీలోకి వెళ్తుండడంతో వారు కూడా బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నారు. ఆ దిశగా మంతనాలు కూడా నిర్వహించారు. బీజేపీ కూడా వారు తమ పార్టీలోకే వస్తారని భావించింది. ఆ దిశగా ప్రచారం కూడా చేసింది. కానీ వారు మాత్రం కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం అంటూ దాట వేసుకుంటూ వచ్చారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నేపథ్యలో తెలంగాణ కేడర్ లో కూడా ఊపు వచ్చింది. దీంతో జూపల్లి, పొంగులేటి వారి పంతాను మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ బెటరని భావించారు. బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు ఈటల రాజేందర్ ను కూడా కాంగ్రెస్ లోకి రమ్మని చెప్పడం కొసమెరుపు.
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు జూపల్లి, పొంగులేటి సోమవారం ఢిల్లీకి పనయం అయ్యరు. మంగళవారం (జూన్ 27న)న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అయితే దీనికి ముందు వారు తమ డిమాండ్లను పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ముందు ఉంచారు. వీడి డిమాండ్లకు ఆయన ఒకే చెప్పడంతో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.
