39.2 C
India
Thursday, June 1, 2023
More

  Ponniyin Selvan 2 : ఓటీటీలోకి ‘పొన్నియిన్ సెల్వన్ 2’.. వారికేనట..

  Date:

  Ponniyin Selvan 2
  Ponniyin Selvan 2

  Ponniyin Selvan 2 : మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం ఇటీవల విడుదలైంది. సినిమా రివ్యూ కూడా బాగుంది. మొదటి పార్ట్ కన్నా రెండో పార్టులో ఎక్కువ విషయాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28వ తేదీ థియేటర్లలోకి వచ్చింది. దాదాపు రెండు వారాలకు పైగా సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది.

  ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం రెంట్ కట్టి మాత్రమే ఈ సినిమాను వీక్షించవచ్చని మేకర్స్ తెలిపారు. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, జయం రవి, కార్తీ కీలకపాత్రల్లో కనిపించిన ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా రాబట్టింది.

  పొన్నియిన్ సెల్వన్ 2 అమేజాన్ ప్రైమ్ లో రెంట్ లో ఉంది. ప్రైమ్ సభ్యత్వంతో సంబంధం లేకుండా ఎవరైనా రూ. 399 చెల్లించి సినిమాను చూడచ్చు. ఒక్కసారి రెంట్ కడితే దాదాపు 48 గంటల వరకూ సినిమా చూడడం పూర్తి చేయాలి లేదంటే సినిమా మళ్లీ కనిపించదు.

  పార్ట్2 గురించి కూలంకుషంగా.. చోళ యువరాజు అరుణ్ మొళి వర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి) తనపైకి వచ్చిన శత్రువులతో పోరాడుతూ సముద్రంలో ముగిపిపోవడంతో ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. పొన్నియిన్ సెల్వన్ కు ఎప్పుడు ఆపద వచ్చినా కాపాడే వృద్ధురాలు ఇప్పుడూ కాపాడుతుంది.

  ఈ సన్నివేషంతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. ఆమె అతన్ని కాపాడుతుందా..? ఇంతకీ ఆమె ఎవరు..? వీరాపాండ్య హత్యకు ప్రతీకారంగా చోళ రాజులను అంతం చేయడమే లక్ష్యంగా వేచి చూస్తున్న పాండ్య సైన్యం లక్ష్యం నెరవేరిందా..? మరోవైపు మదురాంతకుడిని చోళ రాజ్యానికి పట్టపురాజును చేయాలని సొంత రాజ్యంలోనే పన్నులున్న కుట్రలు ఎంతమేరకు విజయంసాధించాయి.

  తనను ప్రేమించిన ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను వ్యూహం పన్ని తన కోటకు రప్పించిన నందిని ఏం చేసింది..? అసలు 9వ శతకంలో చోళ సామ్రాజ్యంలో జరిగిన కతపై రెండో భాగంగా చూపించారు దర్శకుడు. ఈ సినిమాను తను కలల ప్రాజెక్టుగా తీశాడు. ఇది కూడా హిట్ కావడంతో మణిరత్నం ఆనందానికి పగ్గాలు లేకుండా పోయాయి.

  Share post:

  More like this
  Related

  మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

      టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

  ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

      తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

  అల్లుడితో లేచిపోయిన అత్త..!

        మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

  దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

        వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  పీఎస్ తో మళ్లీ ఫాంలోకి త్రిష.. కోలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు..

  మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ దీన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు....

  ఏప్రిల్ 28 న భారీ ఎత్తున విడుదల కానున్న  పొన్నియన్ సెల్వన్ – 2

  పొన్నియన్ సెల్వన్ - 2 చిత్రాన్ని ఏప్రిల్ 28 న భారీ...