Pooja Hegde Stunning : పూజా హెగ్డే.. ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే పూజా హెగ్డే పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకుంది. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుసగా అట్టర్ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న పూజా ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అని పిలిపించు కోవడానికి చాలానే కష్టపడింది.. ఇప్పటి వరకు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోలందరితో ఆడిపాడింది..
దువ్వాడ జగన్నాథం, మహర్షి, అరవింద సమేత వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించిన ఈమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే అల వైకుంఠపురములో అనే చెప్పాలి.. ఈ సినిమాతో ఈమె బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇదే ఊపులో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ కూడా ముందుగా వరుస అవకాశాలు వచ్చాయి.. అయితే ఈ మధ్య మళ్ళీ వరుసగా ప్లాప్ లతో సతమతం అవుతుంది. బీస్ట్, రాధేశ్యామ్ వంటి ప్లాప్స్ తో కెరీర్ డీలా పడింది..
ఏ సినిమా చేసిన ప్లాప్ నే పలకరించడంతో కెరీర్ డల్ అయ్యి అవకాశాలు లేకుండా పోయాయి.. మొన్నటి వరకు ఈ అమ్మడి చేతిలో మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం అయిన ఉండేది కానీ ఇటీవలే ఈ సినిమా నుండి ఈ భామ తప్పుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగులో అయితే ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు..
అయితే పూజా హెగ్డే కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో అందాలను ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తుంది.. ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.. పసుపు బంగారు వర్ణం చీరలో పూజా హెగ్డే దిగిన లేటెస్ట్ పిక్స్ అందరిని ఫిదా చేస్తున్నాయి. చూపులతోనే బాణాలు విసురుతున్న లేటెస్ట్ పిక్స్ మీకోసం.
View this post on Instagram