
Pooja Hegde wedding : ఈ మధ్య కాలంలో బ్యాచిలర్స్ బాగానే కనిపిస్తున్నారు.. అది అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా ఉంటూనే ఉన్నారు.. ఇక ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ ఒక ఇంటి వారు అవుతున్నారు.. హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు.
ఇక నిన్న మాతృ దినోత్సవ సందర్భంగా పూజా హెగ్డే మదర్ లతా హెగ్డే తన కూతురు గురించి ఆమె పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. ఈ ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన మాటలు పూజా హెగ్డే ఫ్యాన్స్ కు కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాయి.. ఇక్క స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.
అక్కడ స్టార్ హీరోయిన్ అవుదాం అని అనుకుంది కానీ ఆమె ఆశలు నిరాశ అవుతున్నాయి.. ఈమె అక్కడ చేస్తున్న అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.. దీంతో అక్కడ స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది. . ప్రజెంట్ ఈమె చేతిలో మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఉంది.. ఇది పక్కన పెడితే ఈమె తల్లి లతా హెగ్డే పూజా పెళ్లి గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పూజాను అన్ని విధాలుగా అర్ధం చేసుకునే వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నాము అని వివాహ బంధం కలకాలం నిలిచి ఉండాలి అంటే వారి మధ్య సఖ్యత బాగా ఉండాలని.. వారి మధ్య గౌరవం మరింత పెరుగుతుంది.. అలాంటి అబ్బాయి దొరికితే ఇచ్చి చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో అని అంతా ఎదురు చూస్తున్నారు.