Poonam Kaur : పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ముఖ్యంగా తను చేసే ట్వీట్లతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె చేసే ట్వీట్లు పవన్ కళ్యాణ్ గురించి అని చాలామంది అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన ఆయన వరదలు వచ్చిన సమయంలో తొందరగా రాలేడని ఒక ట్రీట్ చేసింది. పవర్ రేపిస్టు అని ఒక టిడిపి ఎమ్మెల్యేను సంబోధిస్తూ చేసిన ట్వీట్ కూడా సంచలనం సృష్టించింది.
ఇలా పూనం తన అందంతో కాకుండా ట్వీట్ లు చేస్తు తెగ వైరల్ అవుతుంది. 2006 సంవత్సరంలో మీ మిస్ ఆంధ్రప్రదేశ్ గా విజయం సాధించిన పూనమ్ కౌర్ ఆ తర్వాత సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకుంది. కానీ హీరోయిన్ గా తాను రాణించలేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది.
కాగా ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ గడుపుతుంది. మహిళల హక్కులు తదితర వాటిపై పోరాటాలు చేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా తన ఫోటోలను పోస్ట్ చేయదు. కానీ తాజాగా ఆమె తన పాత పిక్స్ ని పోస్ట్ చేసింది. లెజెండరీ ఆర్టిస్ట్ రవివర్మ గీసిన తన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వైట్ శారీలో బ్లౌస్ లేకుండా తీసుకున్న చిత్రాలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో చాలా మంది ఫిదా అయిపోతున్నారు. పూనం కౌర్ ఏంటి ఇలాంటి ఫోటోలను షేర్ చేసింది అని సంబరపడిపోతున్నారు. చాలా అందంగా ఉన్నావని కామెంట్స్ పెడుతున్నారు.
ఇలా తన ఫోటోలు షేర్ చేయడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా సంచలనాలకు వేదికగా ఉండే పూనంకు సడన్ గా తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని చర్చించుకుంటున్నారు.