Power Astra : బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే రెండు వారాలు కూడా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ లో ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. వారిలో అప్పుడే ఇద్దరు కంటెస్టెంట్స్ రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వగా ఈ వారం కూడా నామినేషన్స్ లో 7 మంది ఉన్నారు.
ఇక తాజాగా మూడవ పవర్ అస్త్రా కోసం హౌస్ లో టాస్క్ జరుగుతుంది.. ఈ పవర్ అస్త్రాను గెలుచుకునేందుకు కంటెండర్లుగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.. శోభా శెట్టి, యావర్ లు ఇప్పటికే కంటెండర్లుగా నిరూపించుకున్నారు.. ఇక తాజాగా అమర్ దీప్ వంతు వచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు అవకాశం లభించింది.
గురువారం అనగా సెప్టెంబర్ 21 నాటి ఎపిసోడ్ లో జానకి కలగనలేదు సీరియల్ హీరో హీరోయిన్ అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పోటీ వచ్చింది. ఇద్దరు కంటెండర్ గా నిరూపించుకోవాలంటే గుండు కొట్టించుకోవాలంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. అమర్ దీప్ కు పూర్తి గుండు చేయించుకోవాలని టాస్క్ ఇవ్వగా ప్రియాంకకు బాబ్ కట్ చేయించుకోవాలని చెప్పారు.
ఈ టాస్క్ లో గుండు అనేసరికి అమర్ దీప్ తన వల్ల కాదని తలపై తనకు కుట్లు పడ్డాయని గుండు చేయించుకుంటే కనిపిస్తుందంటూ ఇలా రకరకాల కారణాలు చెప్పి అమర్ దీప్ క్విట్ అయ్యాడు. ఇక ప్రియాంక జైన్ మాత్రం జుట్టు కత్తించుకోవడానికి ఓకే అని చెప్పి మళ్ళీ అమర్ దీప్ లేడని, అమ్మాయిలకు ఇలాంటి హెయిర్ కట్ బాగుండదు అంటూ రకరకాల కారణాలు చెప్పింది.
ఫైనల్ గా కత్తిరించుకుని కంటెండర్ అయ్యింది. అనుకున్నది సాధించి కంటెండర్ గా అర్హత సాధించింది. మూడవ వారంలో కంటెండర్స్ గా శోభా శెట్టి, ప్రియాంక జైన్, యావర్ లు పోటీ పడనున్నారు.