Bromovie Collections పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా ఈ వీకెండ్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుండి ‘బ్రో’ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతూ వస్తుంది.. మరి ఇది పూర్తిగా పవర్ స్టార్ సినిమా కాకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ముందు నుండి క్రియేట్ అయ్యాయి అనే చెప్పాలి..
పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో ది అవతార్’ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయిన వీకెండ్ కావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రో సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల రుపాయలను రాబట్టినట్టు తాజా సమాచారం.. దీంతో పవర్ స్టార్ ఖాతాలో మరో 100 కోట్ల సినిమా చేరిపోయింది. ఇప్పటి 5 సినిమాలు ఉండగా ఇప్పుడు బ్రో తో కలిసి ఆరు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి.. మరి వీకెండ్ వరకు ఓకే కానీ ఈ రోజు సోమవారం టెస్ట్ లో పాస్ అవుతుందో లేదో చూడాలి..
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.. మొత్తానికి బ్రో మిశ్రమ స్పందన వచ్చిన 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది..