Power Star Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అధికార పార్టీని ఎండగడుతూ ఏకధాటిగా సభలు నిర్వహిస్తూ పలు వర్గాల వారితో సమావేశాలు నిర్వహించి ముచ్చటిస్తున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. విరామం లేకుండా ఆయన పర్యటన కొనసాగుతున్నది. మొన్నటి వరకు షూటింగ్ లతో బిజీ గా ఉన్న పవన్ వెంటనే ఈ యాత్రను మొదలు పెట్టారు. అయితే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు వారాహి రథంపైనే యాత్ర కొనసాగుతున్నది. కాగా, మంగళవారం ఆయన కొంత అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో అభిమానులు, జన సైనికులు హైరానా పడ్డారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం స్వల్పన ఆరోగ్యానికి గురైనట్లు సమాచారం వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు ఉపవాస దీక్షలో ఉండడంతో పవన్ కొంత అస్వస్థతకు గురైనట్లు పిలుస్తున్నది లేదా అమీరంలోని నిర్మల దేవి ఫంక్షన్ హాల్ లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు జన సేన శ్రేణులు చెబుతున్నాయి దీంతో ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గం నేతలతో నిర్వహించాల్సిన సమావేశం రద్దు చేశారు మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభమవుతుందని జనసైనికులు చెబుతున్నారు దీంతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్ సమక్షంలో జనసేనలో చీర కార్యక్రమం సాయంత్రం ఉంటుందని సమాచారం అయితే పవన్ అస్వస్థత గురైనట్లు తెలుసుకున్న జనసేన శ్రేణులు అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. పవన్ ఆరోగ్యంపై అందరూ ఆరా తీస్తున్నారు.