BRO Movie : పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం ఉంటుందో అందరికి ఒక అంచనా అనేది ఉంటుంది.. ఈయన క్రేజ్ మరోసారి ‘బ్రో’ సినిమా రూపంలో బయట పడింది.. పవర్ స్టార్ ఫుల్ మూవీ కాకపోయిన ఈయన ఉండే అరగంట సమయానికే ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ క్రేజ్ పెంచుకున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ తో ఈ మూవీ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.
యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ ను రాబట్టిన ఈ సినిమా టీజర్ బిజినెస్ కు బాగా హెల్ప్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.. మరి బ్రో ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇందులో పవన్ దేవుడి పాత్రలో నటిస్తుండగా.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. కాగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. తమన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమాను జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.. కాగా ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.
ఈ మూవీ మొత్తం తెలుగు రాష్ట్రాలకు కలిపి 83 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని తాజా రిపోర్ట్.. ఆంధ్రా 40 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, నైజాం 30 కోట్లకి అమ్ముడయ్యాయని సమాచారం.. ఓవర్సీస్ లో 13 కోట్లకు ఇతర రాష్ట్రాల హక్కులు కూడా భారీగానే అమ్ముడు పోయాయని తెలుస్తుంది. మొత్తంగా పవన్ కెరీర్ లోనే బెస్ట్ బిజినెస్ జరిగింది అని 100 కోట్ల బిజినెస్ జరిగింది అని టాక్.. మరి ఈ సినిమా కమర్షియల్ గా ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి..
ReplyForward
|