
Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు వచ్చే వారం ఉంది. ఈ వేడుకలకు సంబంధించి ఆన్ లైన్, ఆఫ్ లైన్ సందడి జోరుగా ఉండబోతోంది. కొత్త సినిమాల హడావిడితో పాటు రీరిలీజుల ఉండబోతున్నాయని అందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధం కానుండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా 19, 20 తేదీల్లో (శని-ఆదివారాలు) ‘సలార్: సీజ్ ఫైర్’ను హైదరాబాద్ లో స్పెషల్ షోలు వేయాలనుకుంటున్నారు. ఉదయం ఆటలు బుక్ మై షోలో పెట్టగానే రెడ్ మార్కుకు వెళ్లడం గమనార్హం. థియేటర్ రిలీజై ఏడాది తిరక్కుండా రీ రిలీజ్ అవుతున్నా ఇంత పెద్దస్పందన రావడం చూస్తే డార్లింగ్ ఫ్యాన్స్ మామూలోళ్లు కాదని చెప్పాలి.
22న ‘మిస్టర్ పర్ఫెక్ట్’ను దిల్ రాజు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేసేశారు. రీ మాస్టర్ చేసిన ప్రింట్ తో రీ రిలీజ్ ప్లాన్ చేశఆరు. మరోసారి అనుభూతి పొందేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెబల్ స్టార్ బర్త్ డే రోజు డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’ రీరిలీజ్ రూపంలో పలకరించనుంది.
ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఈశ్వర్ ను దాదాపు సినిమా థియేటర్లలో చూసి ఉండదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా.. అందులో ప్రభాస్ పర్ఫార్మెన్స్ అంతగా ఉండదు కాబట్టి ఎక్కువ జనాల్లోకి వెళ్లలేదు. ఇప్పుడు ఈ ఓల్డ్ సినిమా చూడడం వారికి ఒక అనుభూతి ఇస్తుంది. ఇవి చాలవన్నట్టు ఇప్పటికే మూడు, నాలుగు సార్లు రీ రిలీజ్ చేసిన ‘రెబెల్’ సైతం 23న మళ్లీ వస్తుంది.
వీటన్నింటినీ పక్కన పెడితే ‘ది రాజా సాబ్’ ప్రభాస్ కు బర్త్ డే కానుకగా ఇవ్వబోతున్నట్టు ఎస్కెఎన్ చెప్పిన సంగతి తెలిసిందే. సలార్ 2, కల్కి 2 బీ నుంచి విషెస్ మాత్రమే ఉండవచ్చని టాక్..
హను రాఘవపూడి మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ సిద్ధం చేస్తున్నట్లు వినిపిస్తుంది. అక్టోబర్ 19 నుంచి 23 దాకా ఫ్యాన్స్ కు వీటితోనే సరిపోయేలా కనిపిస్తుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా మార్కెట్ పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ మాత్రం స్పెషల్ గా నిర్వహించుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది.