
Prabhas Business : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కు మార్కెట్ కూడా చాలానే ఉంది.. ఈయన బాహుబలి వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ వందల కోట్ల పెట్టుబడులతో నిర్మితం అవుతున్నాయి. ఇంకా డార్లింగ్ ఒప్పుకోవాలి కానీ ఆయనతో సినిమా చేసేందుకు క్యూలో చాలా మంది నిర్మాతలు ఉన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.. ఈ నాలుగు సినిమాలతో దాదాపు 4 వేల కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉందని సమాచారం.. మరి వాటిలో ఆదిపురుష్ ఒకటి.. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాను టి సిరీస్ సంస్థ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు టాక్.. దీంతో ఈ సినిమా 800 నుండి 1000 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే సలార్.. ఈ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ వారు భారీ స్థాయిలో యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిర్మిస్తున్నారు. ఇది కూడా 800 నుండి 1000 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.. ఇక ఈ రెండు సినిమాలకు మించి ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతుంది.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
కాగా ఈ సినిమా ఏకంగా పాన్ వరల్డ్ గా 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇది ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తుండడంతో ఈ సినిమా 2 వేల కోట్ల బిజినెస్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు.. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా 500 కోట్ల వరకు బిజినెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రభాస్ నాలుగు సినిమాలతోనే మేకర్స్ 4 వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో సగం బిజినెస్ ప్రభాస్ పేరు మీదనే ఉంది.. చూడాలి ఇవి ఎలాంటి హిట్స్ అందుకుని మేకర్స్ కు లాభాలను అందిస్తాయో..