
Prabhas earns : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయాలు స్టార్ట్ చేసారు. గత ఎన్నికల సమయం లోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి దిగిన విషయం తెలిసిందే.. ఒక వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహీ యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ యాత్ర కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక పవన్ వారాహి యాత్రలో అధికార పార్టీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే..
అంతేకాదు తోటి హీరోలపై కూడా ఈయన చేస్తున్న కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా పవన్ నర్సాపురంలో వారాహి విజయయాత్ర జరుగగా అక్కడ ఈయనకు మద్దతుగా ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఈ క్రమంలోనే పవన్ పోస్టర్స్ తో పాటు ప్రభాస్ పోస్టర్స్ కూడా కలిసి హంగామా చేసారు. మరి ఇదే సభలో పవన్ మాట్లాడుతూ..
ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే ఆయన బాహుబలి, ఆదిపురుష్ సినిమాలు చేసారు. వీటి రిజల్ట్ ఎలా ఉన్న కానీ ఆయన సినిమా వచ్చిందంటే రోజులు 1000 నుండి 2000 మంది వరకు ఉపాధి ఉంటుంది. ఈయన సినిమాలు చేసి ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ కడుతున్నారు.. ఈయన సినిమాల వల్ల థియేటర్ల దగ్గర కూడా చిరు వ్యాపారులకు ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.
కానీ ముఖ్యమంత్రి జగన్ కు డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి? ప్రభాస్ లా సినిమాలు చేయలేదు ? ఇలాన్ మాస్క్ లా బిజినెస్ చేయలేదు ? ముఖ్యమంత్రి కొడుకు లా చెలామణి అవుతూ పైరవీలు చేసి అడ్డంగా సంపాదించి.. రోడ్డు మీద దౌర్జన్యాలు చేస్తున్నాడు.. పులివెందులలో పోలీస్ ను కొట్టి లాకప్ లో వేసాడు.. ఇలాంటి వ్యక్తికి పోలీసులు సలాం కొడితే ప్రజల పరిస్థితి ఏంటని ఇలాంటి వ్యక్తికి అధికారం ఇస్తారా అంటూ పవన్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసారు.