
Nag Ashwin Decision : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ పై భారీ అంచనాలు మెదలయ్యాయి. ఈ సినిమా ‘సాన్ డియాగో కామిక్ కాన్’ అనే ప్రతిష్టాత్మక ఈవెంట్ లో అడుగుపెట్టింది. ఇందులో స్థానం సంపాదించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డు పొందింది. జులై 2023 లో జరిగిన ఆ ఈవెంట్ లో ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రం యొక్క గ్రాఫిక్స్ అదరగొట్టేశాయి. హాలీవుడ్ తరహా లో సినిమా టేకింగ్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంను వచ్చే ఏడాది(2024) జనవరి 12 న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే చెప్పింది. కానీ గ్లింప్స్ రిలీజ్ చేసే సమయంలో విడుదల తేదీ ప్రస్థావన లేదు. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో ‘కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పాడు. దీంతో ఈ మూవీ విడుదల ఇంకా ఆలస్యం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ డేట్ గురించి ఆలోచన చేస్తామని నాగ్ అశ్విన్ తెలిపాడు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశంలో ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మిగతా షూటింగ్ హైదరాబాద్‍లో జరగనున్నట్లు చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. షూటింగ్ పూర్తైన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకొంత సమయం పట్టేలా ఉంది. ఇవన్నీ చూసుకున్నాకే మూవీ టీం రిలీజ్ డేట్ ను నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం వచ్చే ఏడాది మే, జూన్ లో విడుదలవుతుందనే సమాచారం.