
Prabhas last wish : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కు క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. ఈయన కెరీర్ లో ఏ హీరో తన వైపు కూడా రాలేని విధంగా దూసుకు పోతున్నాడు. ఇదిలా ఉండగా ఈయన వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి అనే పేరు ఉంది.. మంచి మనస్సు ఉంది అని.. ఈయనకు దానగుణం చాలా ఎక్కువ అని.. అంతేకాదు అతిథి మర్యాదలు చేయడంలో డార్లింగ్ తర్వాతనే ఎవ్వరైనా అని చెప్పాలి.. విందు భోజనాలతోనే ఈయన చంపేస్తుందని టాక్ ఉంది.
తాను ఏ సినిమా చేస్తున్న కూడా ఆ సినిమా యూనిట్ మొత్తానికి ఎన్ని రోజులు షూట్ జరిగితే అన్ని రోజులు భోజనం ఆయన ఇంటి నుండే వస్తుంది.. ఈ విషయాన్నీ ఆయనతో పని చేసిన నటీనటులు చెప్పడం మనం చాలాసార్లు విన్నాం.. అందుకే ఈయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇక ఈయన ఫ్యాన్స్ కు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు..
అయితే ప్రభాస్ ఒక అభిమాని కోసం గతంలో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నువ్వు దేవుడివి స్వామి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ డార్లింగ్ ఏం చేసాడంటే.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న అభిమాని పేరు కన్నయ్య అలియాస్ రంజిత్.. ఈయనకు రేర్ క్యాన్సర్ ఉండడంతో ఈయన మరణించారు.
ఇతడి చివరి రోజుల్లో ఆయన ఆఖరి కోరిక తీర్చడం కోసం తల్లిదండ్రులు అతడికి ఇష్టమైన పనులన్నీ చేసారు.. అతడికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఉండడంతో చివరి కోరిక తీర్చడం కోసం పూరీ భార్య లావణ్యకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ప్రభాస్ కు ఈమె విషయాన్నీ చేరవేయడంలో అతడిని కలిసేందుకు ప్రభాస్ వెంటనే ఒప్పుకున్నారట..
అంతేకాదు అతడికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసుకుని చివరి కోరిక కూడా అడుగగా.. బాహుబలిలో వాడిన ఏదైనా వస్తువును ఇవ్వాలని రంజిత్ కోరగా ప్రభాస్ అతడికి ఇష్టమైన చికెన్ మంచూరియ తెప్పించడంతో పటు బాహుబలి కత్తిని కూడా బహుమతిగా ఇచ్చారట.. గత ఏడాది జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. దీంతో డార్లింగ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.






