prabhas ప్రభాస్ – నాక్ అశ్విన్ కాంబోలో చేస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్-కే’. ఈ సినిమాను ‘వైజయంతి మూవీస్’ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఏ సినీ ఇండస్ట్రీలో చూసిన ప్రాజెక్ట్ కే గురించే మాట్లాడుకుంటున్నారంటే సందేహం లేదు. నాగ్ అశ్విన్ విలక్షణమైన దర్శకుడు. ఆయన చేసే ప్రతీ ప్రాజెక్ట్ సక్సెస్ అనే చెప్పాలి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ రెండు భిన్న కథలు అయినా రెండింటినీ ప్రేక్షకులు ఊహించినదానికంటే ఎక్కువ ఎక్పక్టేషన్ తో తెరకెక్కించారు ఆయన.రీసెంట్ గా ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ కేపై ఇప్పటి వరకు చిత్ర సీమలో లేని అంచానాలు ఉన్నాయి.
నిన్న (జూలై 19) ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేసేందుకు ఎటువంటి హింట్లు ఇవ్వకుండా రిలీజ్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. ఒంటి నిండా కవచంతో పొడువాటి వెంట్రుకలను ముడి వేసుకొని కనిపించాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకా టైటిల్ ను మాత్రం ఖారు చేయలేదు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ చేస్తున్నారు.
అయితే ఈ రోజు (జూలై 20)న టైటిల్ ప్రకటిస్తామని, రేపు (జూలై 21)న గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ‘వైజయంతీ మూవీస్’ తన అఫీషియల్ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. దీనికి తోడు నిన్ననే (జూలై 19) యూఎస్ఏ లోని శాన్ డియాగోకు వెళ్లింది చిత్ర యూనిట్ అక్కడ కొంత మేర చిత్రీకరించనున్నారు. ఈ రోజు ఈ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నిర్వహించిన కామికాన్ లో హీరో ప్రభాస్, రానా సందడి చేస్తూ కనిపించారు. ఇందులో ప్రభాస్ బ్లూ కలర్ సూట్ లో స్టైలిష్ గా కనిపించారు. ఇందులో రాణా కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.