Prabhas-Maruti movie : కమర్షియల్ డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. దీంతో అందరు ఆసక్తిగా ఉన్నారు. సినిమాల ఎంపికలో కొత్తదనం చూపిస్తున్న ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో మారుతి. ప్రభాస్ ఇప్పటికే సినిమాల విషయంలో జోరు మీదున్నాడు. సాహో, రాధేశ్యాం సినిమాలు నిరాశ పరచడంతో ఈ సినిమాపై ఫోకస్ పెడుతున్నారు.
ఈసినిమా టైటిల్ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. రాహుల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మరోవైపు అంబాసిడర్ అనే పేరును కూడా అనుకుంటున్నారట. మరో విషయం ఏంటంటే రాజా డీలక్స్ కూడా ఆలోచిస్తున్నారట. మొత్తానికి రాయల్ కే మొగ్గు చూపుతున్నారని సమాచారం. దీంతో ప్రభాస్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
కథలో కొత్తదనం ఉంటుందంటునన్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. హారర్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందని మరో కథ ప్రచారంలో ఉంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నారు. మాస్ మసాలాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మారుతి ఈ ప్రాజెక్టు కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే టైటిల్ ఖరారు చేయనున్నారు. మారుతి ప్రభాస్ ను మంచి కోణంలో చూపించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇద్దరికి మంచి పేరు రానుందని అంటున్నారు. మారుతి సినిమాల్లో మంచి వైవిధ్యం ఉన్న కథతో రెడీ అవుతున్నాడు. దీంతో ప్రభాస్ రేంజ్ మరోమారు పెరగనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే ప్రభాస్, మారుతి కాంబినేషన్ రికార్డులు క్రియేట్ చేస్తుందంటున్నారు.