డార్లింగ్ ప్రభాస్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తన అభిమానులను కలుసుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసాడు. అక్కడికి వచ్చిన అభిమానులతో ఫోటో షెషన్ నిర్వహించాడు. ఇక ఆ ఫోటో షెషన్ కోసం ప్రభాస్ తయారై వచ్చిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక మహిళా అభిమానులు అయితే పరవశించిపోయారు.
ప్రభాస్ లుక్ బాగుండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అబ్బా ! ఏమున్నాడ్రా బాబూ ! అంటూ కళ్ళతోనే తినేశారట లేడీ ఫ్యాన్స్. మహిళా అభిమానులు తనని తినేసేలా చూస్తుంటే ప్రభాస్ చాలా సిగ్గుపడ్డాడట . ఎందుకంటే ప్రభాస్ కు సిగ్గు ఎక్కువ …… పెద్దగా మాట్లాడడు అనే విషయం తెలిసిందే.
ప్రభాస్ తాజాగా పలు సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్- K అనే చిత్రం చేస్తున్నాడు. ఇక మధ్యలో మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇలా వరుసగా మూడు సినిమాలు సెట్స్ మీద ఉండటంతో ఇటీవల జ్వరంతో బాధపడ్డాడు. జ్వరం ఎక్కువ కావడంతో షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు.