
Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కు క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కు మార్కెట్ కూడా చాలానే ఉంది.. ఈయన బాహుబలి వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ వందల కోట్ల పెట్టుబడులతో నిర్మితం అవుతున్నాయి. ప్రభాస్ తెలుగు హీరోలు ఎవ్వరు చేరుకొని స్థాయికి ఎదిగాడు.
అయితే కెరీర్ లో ఈయన నటించాలంటే డైరెక్టర్లకు కొన్ని కండిషన్స్ పెట్టేవారట.. సినీ కెరీర్ లో అన్ని రోల్స్ చేయాలి.. డైరెక్టర్ ఆ సీన్ కు తగ్గట్టు ఎలా చెబితే అలా చేయాలి.. అయితే ప్రభాస్ మాత్రం ఒక డైరెక్టర్ చెప్పినట్టు చేయడానికి తెగ సిగ్గు పడ్డారట.. ఆయన కెరీర్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన సినిమా పౌర్ణమి.. అయితే ఇది అంతగా అలరించలేక పోయింది.
ఈ సినిమాలో ప్రభాస్ ను అలా ఎవ్వరు కోరుకోలేదు.. ఈ సినిమాలో త్రిషతో మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే.. మరీ ముఖ్యంగా త్రిషతో ఒక సీన్ లో బాగా మింగిల్ అవ్వాల్సి ఉంది.. చెట్టు పొదల్లో త్రిష, ప్రభాస్ ఒక్కటి అవుతారు.. ప్రభాస్ కు త్రిషకు ఒంటి మీద బట్టలు కూడా ఉండవు.. అయితే ఈ షూటింగ్ సమయంలో ప్రభాస్ తెగ సిగ్గుపడ్డారట..
నాకు సిగ్గు నేను అలా చేయను.. షర్ట్ వేసుకుంటాను.. ఎడిటింగ్ లో తీసేయండి అంటూ చెప్పారట.. అయితే డైరెక్టర్ సీన్లు న్యాచురల్ గా రావాలని చెప్పిన ప్రభాస్ తో వినలేదట.. ఈ రెండు సీన్స్ కోసం పోస్ట్ పోన్ చేయించారట.. దీంతో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు రంగంలోకి దిగి ఈ సీన్స్ ను చేయించారట.. అయితే ఈ చిన్న సీన్స్ కోసమే నాలుగు గంటల సమయం తీసుకుని షూట్ చేశారట.. ఇక ఈ మధ్య వచ్చిన రాధేశ్యామ్ సినిమా సమయంలో కూడా రొమాంటిక్ సన్నివేశాల కోసం డైరెక్టర్ ను చాలా ఇబ్బంది పెట్టినట్టు టాక్..