Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ప్రస్తుతం నేషనల్ లెవల్లో ఉంది. పాన్ ఇండియాలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో సందేహమే లేదు. తెలుగుతోపాటు ఇటు దక్షిణ భారతదేశం అటు హిందీ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ .. నార్త్ ఇండియా అంతట ప్రభాస్ కు తిరుగులేని మార్కెట్ ఏర్పడింది. దానికి తగినట్టుగానే ప్రభాస్ చాలా స్ట్రాంగ్ లైన్ తో ముందుకు వెళుతున్నాడు. బాహుబలి 1 – 2 సినిమాల తర్వాత మూడు వరుస ప్లాప్ సినిమాలు ప్రభాస్ కు ఎదురైన ఆ వెంటనే సలార్ – కల్కి సినిమాతో తిరిగిలేని సూపర్ డూపర్ హిట్లు కొట్టి తిరిగిలేని స్ట్రాంగ్ హీరో అయిపోయాడు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో మరోసారి డార్లింగ్ పేరు మార్మోగింది.
ప్రస్తుతం ప్రభాస్ చాలామంది దర్శకులతో పనిచేస్తున్న.. తాజాగా మరో ఇద్దరు యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ .. అలాగే టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇద్దరు పేర్లు ఇప్పుడు ప్రభాస్ లైన్లో ఉన్నాయి. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ లైన్లో సలార్ 2 – కల్కి 2 స్పిరిట్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా ఆల్రెడీ షూటింగు దశలో ఉంది. ఈ సినిమాల తర్వాత లోకేష్ కనకరాజ్ – ప్రశాంత్ వర్మ సినిమాలు పట్టాలెక్కుతాయని తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానిందని సమాచారం.