
Prabhas Teaching : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తన తోటి హీరోలకు సరికొత్త లెసన్ నేర్పిస్తున్నాడు.. ఏ విషయంలో పాఠాలు నేర్పిస్తున్నాడు అంటే.. ”ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను” ఇదే మాటను వారి ఫ్యాన్స్ ముందు స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు చెప్పుకొచ్చారు. వీరే కాదు చాలా మంది చేస్తామని వాగ్దానాలు చేసారు.
కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే ఏడాదికి రెండు కాదు కదా ఒకటి కూడా రిలీజ్ చేయలేక పోతున్నారు. నెలలకు నెలకు ఖాళీగానే కూర్చుంటున్నారు కానీ వెంటవెంటనే ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయడం లేదు.. మరి ఇదే మాటను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సైతం తన ఫ్యాన్స్ కు చెప్పారు.. చెప్పినట్టే ఆయన వరుస సినిమాలను ప్రకటిస్తూ వాటిని పూర్తి కూడా చేస్తున్నాడు.
ఈ ఏడాది ఆదిపురుష్ జూన్ లో రిలీజ్ కానుంది. మళ్ళీ మూడు నెలల్లోనే సలార్ సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు. అలాగే వచ్చే ఏడాది కూడా ప్రాజెక్ట్ కే తో పాటు మారుతి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇంకా 2025కు కూడా స్పిరిట్ సినిమాను ప్రకటించి సిద్ధం చేయబోతున్నాడు.. ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తోటి హీరోలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు..
ఇలానే మిగతా హీరోలు కూడా వరుస సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏ హీరోకు తగ్గట్టుగా వారి సమయాన్ని బట్టి లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు .. అలాగే పూర్తి చేస్తున్నారు.. కానీ అదే లైనప్ ను కొద్దిగా స్పీడ్ గా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు కానీ ఇది ఎంత వరకు సాధ్యమో చూడాలి..






