Praneet Rao Arrest : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. డీఎస్పీ ప్రవీణ్ రావును పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకుని సీక్రేట్ ప్లేస్ లో విచారిస్తున్నారు. ఆయనపై అత్యంత తీవ్రమైన అభియోగాలతో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. దీంతో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ప్రణీత్ రావు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకుని అధికారికంగా ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబీ ఆఫీస్ లోనే ఈ వ్యవహారం సాగించారని భావిస్తున్నారు. కాంగ్రెస్ గెలిచిన రోజునే.. తన ఆఫీస్ లోని డాటాను మొత్తం ఎరేజ్ చేశారు. తన సొంత డిస్కుల్లోకి కాపీ చేసుకున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఎవరెవరిపై నిఘా పెట్టారన్నదానిపై అనేక ఆధారాలు ఉండడంతో.. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకుని ఇతర అంశాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత్ రావు విచారణలో ఏం చెబుతారన్నది పోలీస్ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారులను వెలుగులోకి తేవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
మొత్తానికి గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రణీత్ రావు వెనకుండి నడిపించిన పెద్దల పేర్లు చెబితే అది ఎంతవరకు దారితీస్తుందో చెప్పలేం. చూడాలి ఈ ట్యాపింగ్ కేసు ఏ తీరాలు చేరుతుందో..