20 C
India
Saturday, January 17, 2026
More

    Tirumala : తిరుమలలో ప్రాంక్ వీడియోలు.. శ్రీవారి భక్తులతో ఆకతాయిల పరాచికాలు

    Date:

    Tirumala
    Tirumala

    Tirumala :  తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను ఆటపట్టిస్తూ యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో టీటీడీ చర్యలు తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉన్న చోటికి యువకులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే విమర్శలపై టీటీడీ అధికారులు స్పందించారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడుకు పంపించారు.  శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను ఆటపట్టించేందుకు యువకుడు ఓ ప్రాంక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తన స్నేహితులతో కలిసి తిరుమలకు వచ్చాడు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులను ఆటపట్టించేందుకు వాసన్ మిత్ర ఈ వీడియోను రూపొందించారు. క్యూ లైన్‌లో వెళ్తున్న వారి కోసం వేచి ఉన్న కంపార్ట్‌మెంట్ తాళాలు తీసే ఉద్యోగి మాదిరి నటించాడు.

    తాళాలు తీస్తున్నట్లు నటించడంతో నిజమని నమ్మిన భక్తులు ఒక్కసారిగా లేచి కంపార్ట్‌మెంట్‌ గేట్లను తెరుస్తారేమోనని భావించి గేట్లవైపు బయలుదేరారు. తర్వాత నవ్వుతూ వెనక్కి పరుగెత్తాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తమిళనాడులో వైరల్‌గా మారింది. ఈ విషయంపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో టీటీడీ చర్యలు తీసుకుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం ప్రకటించారు. వాసన్‌తో పాటు అతడికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంపించారు.

    శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో క్యూలైన్లలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందనే అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియో టీటీడీ భద్రతా లోపాలను బయటపెట్టింది. శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.  దీనిపై విచారణ చేపట్టిన టీటీడీ.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చిలిపి వీడియోలు చేయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో ఖండించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Tirumala : తిరుమలలో విషయంలో టీటీడీ కీలక నిర్ణయం

    Tirumala : తిరుమలలో వన్యప్రాణుల సంచారం, ముఖ్యంగా చిరుతల కదలిక భక్తులకు భయాందోళన...

    Tirumala : సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

    Tirumala : అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి...

    Tirumala : తిరుమల ఆలయంపై డ్రోన్ కలకలం: యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్

    Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగురవేయడం...