Prathipadu Constituency Review :
వైసీపీ : మేకతోటి సుచరిత (ప్రస్తుత ఎమ్మెల్యే)
గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి సుచరిత టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు పై 7 వేల ఓట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత ఆయన కూడా వైసీపీ లో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి వైసీపీ ఇక్కడ బలంగా ఎదుగుతూ వచ్చింది.
ఇక ఎన్నికల్లో గెలిచాక మేకతోటి సుచరిత వైఎస్ జగన్ ప్రభుత్వంలో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. నాటి నుంచి కొంత అసంతృప్తి గా ఉన్నారు. ఒకానొక దశలో ఆమె భర్త దయాసాగర్ టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఆయనకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందనే అభిప్రాయం అందరిలో వినిపిస్తున్నది.
అయితే మరోవైపు ఈ నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతగా ఉన్న వరుపుల రాజా ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన స్థానంలో కొన్నాళ్లు రాజా సతీమణి సత్యప్రభ కు ఇన్ చార్జిగా అవకాశం కల్పించారు. అయితే ఇటీవల ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ బీఎస్ రామాంజనేయులును ఇక్కడ ఇన్ చార్జిగా పార్టీ అధినేత నియమించారు. ఇక ఇక్కడి నుంచి ఆయన పోటీ ఖాయమనే అభిప్రాయం వినిపిస్తున్నది. పార్టీలో కీలకనేతగా ఉన్న జ్యోతుల నెహ్రు ఇక్కడి రాజకీయాలను వెనుక ఉండి నడిపిస్తుంటారనే పేరుంది. గతంలో ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2014లో ఇక్కడ టీడీపీ నుంచి రావెల కిశోర్ బాబు గెలిచారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయన పదవి పోవడంతో, పార్టీ మారాయి. ఇక ఇక్కడి నుంచి 2024 ఎన్నికల్లో పోటీకి రామాంజనేయులు ఆసక్తి చూపడంతో, పార్టీ ఆయనకు ఇన్ చార్జిగా అవకాశం ఇచ్చింది.
అయితే సుమారు 2.50 లక్షలకు పైగా ఓటర్లున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు కీలకంగా మారాయి. అయితే రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. మరోసారి గెలిచి ఆసెంబ్లీ అడుగు పెట్టాలని మేకతోటి సుచరిత భావిస్తుండగా, టీడీపీలో కొత్త అభ్యర్థి రామాంజనేయులు కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అయితే రెండు పార్టీల్లోనూ వర్గ విభేదాలు కొంత ఇబ్బంది కలిగిస్తుండగా, అధినేతలు పిలిచి మాట్లాడితే సమసిపోతాయనే అభిప్రాయం ఉంది.